నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్దదైన కాన్హా శాంతివనం ధ్యాన కేంద్రానిట్న తెలంగాణలో ఏర్పాటు చేయడం చాలా గొప్పవిషయమని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన రైజింగ్ విత్ ౖMðండ్‌నెస్ (యువజన సదస్సు) కార్యక్రమాన్ని కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఈ ప్రదేశాన్ని మార్చి వేసి.. పచ్చని చెట్లు పెంచి, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 3ఐలకు.. అంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి అభివృద్ధికి బాటలు వేసిందని, దీంతో యువత ఆలోచన, భావజాలంలో ఎంతో మార్పువచ్చిందని వివరించారు. ఈ ఆలోచనా విధానంతోనే రాష్ట్ర ప్రభుత్వం 240 కోట్లకు పైగా మొక్కలు నాటిందని చెప్పారు. కాగా, కేవలం ఐదు సంవత్సరాలలో లక్షలాది మొక్కలు నాటి బంజరు భూమిని పచ్చగా మార్చడంతో కాన్హా శాంతివనం ఎంతో గొప్పగా రూపుదిద్దుకుందని కొనియాడారు. యువతకు కరుణ, దయా, విలువల గురించి అవగాహనను కల్పించడానికి విద్యాసంస్థల్లో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అనంతరం గురూజీ దాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో స్వాభావికమైన దయ గుణం ఉంటుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో యూఏఈ, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 12 వేల మంది పాలుపంచుకుంటున్నారు. గురూజీ కమ్లేష్ పటేల్, యునెస్కో డైరెక్టర్ డాక్టర్ అనంత దురైయప్ప, ఏఆర్ రహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్ ఖతీజా రెహ్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment