ఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 19 నుంచి పది రోజుల పాటు ధ్యానానికి వెళ్లనున్నారు. ఆయన ఏ ప్రదేశంలో ఉన్న సెంటర్‌కు వెళ్లనున్నారనేది మాత్రం బయటకు వెళ్లడించలేదు.
విపశ్యన అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. దీనిలో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కోర్సు పూర్తయ్యే వరకు(పది రోజుల పాటు) మాట్లాడటం ద్వారా లేదా సంజ్ఞల ద్వారా సంభాషణకు దూరంగా ఉంటారు. అభ్యాసకులు ధ్యాన కేంద్రం నుంచి బయటకు రావడం నిషిద్ధం. బయటి వ్యక్తులు కేంద్రంలోకి వెళ్లడం కూడా ఉండదు.
కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన సాధన చేస్తున్నారు. ఈ పురాతన ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి గతంలో బెంగళూరు, జైపూర్‌తో సహా అనేక ప్రాంతాలకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రతి ఏడాది విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకు ధ్యానంలో ఉంటారు.
ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు
Comments
Please login to add a commentAdd a comment