Vipassana course
-
Vipassana Meditation: విపశ్యన ధ్యానానికి ఢిల్లీ సీఎం
ఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 19 నుంచి పది రోజుల పాటు ధ్యానానికి వెళ్లనున్నారు. ఆయన ఏ ప్రదేశంలో ఉన్న సెంటర్‌కు వెళ్లనున్నారనేది మాత్రం బయటకు వెళ్లడించలేదు. విపశ్యన అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. దీనిలో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కోర్సు పూర్తయ్యే వరకు(పది రోజుల పాటు) మాట్లాడటం ద్వారా లేదా సంజ్ఞల ద్వారా సంభాషణకు దూరంగా ఉంటారు. అభ్యాసకులు ధ్యాన కేంద్రం నుంచి బయటకు రావడం నిషిద్ధం. బయటి వ్యక్తులు కేంద్రంలోకి వెళ్లడం కూడా ఉండదు. కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన సాధన చేస్తున్నారు. ఈ పురాతన ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి గతంలో బెంగళూరు, జైపూర్‌తో సహా అనేక ప్రాంతాలకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రతి ఏడాది విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకు ధ్యానంలో ఉంటారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
ధ్యానంలో కేజ్రీవాల్?!
న్యూఢిల్లీ : అవును మీరు జదివింది నిజమే. కొద్దికాలంగా మీడియాకు, ట్విటర్‌కు దూరంగా ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ధ్యానం చేయడంలో మెళుకువలు నేర్చుకుంటున్నారు. పాలనాపరమైన ఒత్తిళ్లు, ఇతర సమస్యలను తట్టుకునేందుకే విపశ్యన ధ్యాన కేంద్రంలో సాధణచేస్తున్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఇగ్తపురిలో ఉన్న విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రంలో పది రోజుల పాటు కేజ్రీవాల్ ధ్యాన సాధన చేస్తారని ఆప్ అధికార ప్రతినిధి ప్రీతి శర్మ మీనన్ ప్రకటించారు. ధ్యాన కేంద్రం నియమాలను అనుసరించి కేజ్రీవాల్ తన ఫోన్ స్విచాఫ్ చేశారని మీనన్ చెప్పారు. ధ్యాన కేంద్రంలో కేజ్రీవాల్ కోర్సు ఈ నెల 19న పూర్తవుతుందని.. తరువాత ఆయన మీడియా ప్రతినిధులకు, సామాజిక మాధ్యమాలకు అందుబాటులోకి వస్తారని ఆమె తెలిపారు.