ధ్యానంలో కేజ్రీవాల్‌?! | Arvind Kejriwal on Vipassana course | Sakshi
Sakshi News home page

ధ్యానంలో కేజ్రీవాల్‌?!

Published Tue, Sep 12 2017 2:26 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

ధ్యానంలో కేజ్రీవాల్‌?!

ధ్యానంలో కేజ్రీవాల్‌?!

న్యూఢిల్లీ : అవును మీరు జదివింది నిజమే. కొద్దికాలంగా మీడియాకు, ట్విటర్‌కు దూరంగా ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ధ్యానం చేయడంలో మెళుకువలు నేర్చుకుంటున్నారు. పాలనాపరమైన ఒత్తిళ్లు, ఇతర సమస్యలను తట్టుకునేందుకే విపశ్యన ధ్యాన కేంద్రంలో సాధణచేస్తున్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని ఇగ్తపురిలో ఉన్న విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రంలో పది రోజుల పాటు కేజ్రీవాల్‌ ధ్యాన సాధన చేస్తారని ఆప్‌ అధికార ప్రతినిధి ప్రీతి శర్మ మీనన్‌ ప్రకటించారు. ధ్యాన కేంద్రం నియమాలను అనుసరించి కేజ్రీవాల్‌ తన ఫోన్‌ స్విచాఫ్‌ చేశారని మీనన్‌ చెప్పారు.
ధ్యాన కేంద్రంలో కేజ్రీవాల్‌ కోర్సు ఈ నెల 19న పూర్తవుతుందని.. తరువాత ఆయన మీడియా ప్రతినిధులకు, సామాజిక మాధ్యమాలకు అందుబాటులోకి వస్తారని ఆమె తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement