Vipassana meditation
-
జైల్లో కూడా కేజ్రీవాల్ విపాసన చేయవచ్చు: బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపాసన ధ్యానం కోర్సులో చేరిన విషయం తెలిసిందే. పది రోజులపాటు కొనసాగనున్న ఈ ధ్యానం కోర్సు కోసం బుధవారమే కేజ్రీవాల్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు వెళ్లారు. అయితే ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకల కేసులో విచారణకు రావాలని ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. దీని ప్రకారం నేడు(గురువారం) ఈడీ ఎదుట కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంది. కానీ విచారణకు డుమ్మా కొట్టి ధ్యాన శిబిరానికి వెళ్లారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విపాసన ధ్యానపై బీజేపీ గురువారం తీవ్రస్ధాయిలో మండిపడింది. జవాబుదారీతనం, అరవింద్ కేజ్రీవాల్ ఒకచోట ఉండలేవని విమర్శలు గుప్పించింది.. ఈడీ సమన్లను భేఖాతరు చేయడంపై బీజేపీ నేత సంబిట్ పాత్ర స్పందిస్తూ.. కేజ్రీవాల్, కర్త్యవ్యం ఎన్నడూ కలిసి పనిచేయలేవని పేర్కొన్నారు. విపాసన పేరును అడ్డుపెట్టుకొని దాక్కుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ జైల్లో విపాసన చేయగలరని వ్యాఖ్యానించారు. కాగా మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేసిన అనంతరం బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రెండోసారి సమన్లు జారీ చేయడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ఆరుపేజీల లేఖ రాశారు. ఇక ఈడీ తనకు పంపిన సమన్లు అక్రమమని, రాజకీయ దురుద్దేశంతో కూడినవని కేజ్రీవాల్ అభివర్ణించారు. తాను ఎలాంటి సమన్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, గత సమన్ల తరహాలో తాజా ఈడీ సమన్లు కూడా రాజకీయ దురుద్దేశంతో కూడినవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సమన్ను ఉపసంహరించాలని, తాను నిజాయితీ, పారదర్శకతో కూడిన జీవితం గడిపానని, తనవద్ద దాచేందుకు ఏమీ లేదని ఢిల్లీ సీఎం వెల్లడించారు. చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..?
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కేజ్రీవాల్ ప్రతి ఏడాది చలికాలంలో ఈ విపాసన ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్ వంటి నగరాల్లో ఆయన ఈ శిక్షణకు హాజరయ్యారు కూడా. అసలేంటి విపాసనా ధ్యానం? ఎందుకు చేస్తారు తదితరాల గురించే ఈ కథనం!. విపాసనా ధ్యానం అంటే.. విపసనా ధ్యానం అనేది మీ మనస్సును లోతుగా కేంద్రీకరించడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన అభ్యాసం. విపాసన అంటే 'అంతర్దృష్టి' అనే అర్థం వస్తుంది. అంటే విపాసన అభ్యాసం ద్వారా విషయాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో లోతుగా అర్థం చేసుకొని, మనశ్శాంతిని సాధించడం. ఇది చంచలమైన మనస్సును నియంత్రించి, ప్రశాంతత చేకూరుస్తుంది. తద్వారా ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించేలా చేసే స్థితిని కల్పిస్తుంది. వివిధ రకాల ఆలోచనలు చుట్టుముట్టకుండా, మీ అంతరంగాన్ని ఏకాగ్రం చేసి, స్వీయ పరిశీలనను అభ్యసించడానికి మిమ్మల్ని ఈ మెడిటేషన్ టెక్నిక్ అనుమతిస్తుంది. విపసనా ధ్యానం అనేది బౌద్ధమతంలో ఆచరించే పురాతన ధ్యాన పద్ధతి. సుమారు 2,400 సంవత్సరాల క్రితం బుద్ధుడు సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ధ్యాన అభ్యాసం ఆగ్నేయాసియా, శ్రీలంకలో చాలా ఎక్కువగా ఆచరిస్తారు. భారతదేశంలో కూడా చాలా చోట్ల విపాసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఇది మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మానసిక ప్రశాంతతను ఇవ్వడమే గాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ధ్యానంతో కలిగే ప్రయోజనాలు.. విపసనా ధ్యానంతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీనికి విశేష జనాదరణ ఉంది. ఇది చేస్తే మెరుగైన ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మాదక ద్రవ్యాల అడిక్షన్ నుంచి బయటపడేలా చేస్తుంది అధ్యయనంలో 40 రోజులు ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్కిక్ తీసుకున్న వారిలో ఈ మార్పులన్ని గమనించారు పరిశోధకులు. వారిలో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి ప్రశాంత చిత్తంతో కనిపించారని చెబుతున్నారు. ఎలా చేయాలంటే.. ముందుగా సుఖాసంనలో కూర్చొని నడుం నిటారుగా ఉంచి శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. మీ మనో చిత్తంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఎలాంటి ఆలోచనలు రాకుండా చేసుకోవాలి. మొదట్లో ఐదు నుంచి 10 నిమిషాలు చేయండి. క్రమేణ పెంచుతూ 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ధ్యానం చేయండి. (చదవండి: పొడవాటి జుట్టు లేకపోయినా మిస్ ఫ్రాన్స్‌గా కిరీటం దక్కించుకుంది! అందానికి..) -
ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాగా కేజ్రీవాల్ ప్రతి ఏడాది చలికాలంలో విపాసన ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్ వంటి నగరాల్లో ఆయన ఈ శిక్షణకు హాజరయ్యారు. అయితే ఈసారి ఎక్కడికి వెళ్తున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21 విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ విపాసన మెడిటేషన్ సెషన్‌కు హాజరు అవుతుండంతో.. మరోసారి ఈడీ విచారణకు ఆయన గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విపాసన ధ్యానం ముందుగా నిర్ణయించిన కార్యక్రమమని ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా చెప్పారు. ఈడీ నోటీసులపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. త్వరలోనే ఈ విషయమై ఈడీకి సమాధానం ఇస్తామని వెల్లడించారు. చదవండి: అనంతపురం: రూ. 46 లక్షల చోరీ ఘటన.. అంతా డ్రామా.. -
Vipassana Meditation: విపశ్యన ధ్యానానికి ఢిల్లీ సీఎం
ఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 19 నుంచి పది రోజుల పాటు ధ్యానానికి వెళ్లనున్నారు. ఆయన ఏ ప్రదేశంలో ఉన్న సెంటర్‌కు వెళ్లనున్నారనేది మాత్రం బయటకు వెళ్లడించలేదు. విపశ్యన అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. దీనిలో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కోర్సు పూర్తయ్యే వరకు(పది రోజుల పాటు) మాట్లాడటం ద్వారా లేదా సంజ్ఞల ద్వారా సంభాషణకు దూరంగా ఉంటారు. అభ్యాసకులు ధ్యాన కేంద్రం నుంచి బయటకు రావడం నిషిద్ధం. బయటి వ్యక్తులు కేంద్రంలోకి వెళ్లడం కూడా ఉండదు. కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన సాధన చేస్తున్నారు. ఈ పురాతన ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి గతంలో బెంగళూరు, జైపూర్‌తో సహా అనేక ప్రాంతాలకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రతి ఏడాది విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకు ధ్యానంలో ఉంటారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
మీడియాకు కేజ్రీవాల్ దూరం! ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెలలో 12 రోజులపాటు మీడియాకు దూరంగా ఉండబోతున్నారట!. న్యూస్ పేపర్లు, టీవీ లాంటి వాటి జోలికి అసలు వెళ్లరని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఒకరు తెలిపారు. ఇంతకు ఈ 12 రోజుల పాటు కేజ్రీవాల్ ఏం చేస్తారు? ఇదేగా మీ డౌటు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో వరుసగా వివాదాల తర్వాత కేజ్రీవాల్ కొంత బ్రేక్ కోరుకుంటున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత 'విపాసన' ధ్యానం కోసం బ్రేక్ తీసుకున్న కేజ్రీవాల్.. వచ్చే నెలలో విపాసన కోసం 12 రోజులపాటు లాంగ్ లీవ్ ను తీసుకోనున్నారు. చాలాకాలంగా ఆయన విపాసన ధ్యాన సాధన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న నాగ్ పూర్ లోని మెడిటేషన్ సెంటర్ లో ఇందుకు పేరు నమోదు చేసుకోనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ లీవ్ లో ఉండే ఈ కాలంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. విపరీతమైన దగ్గు కారణంగా ఈ ఏడాది జనవరిలో కేజ్రీవాల్ 10 రోజులపాటు మెడికల్ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే.