
సాక్షి, ముంబై: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివసేన అభిప్రాయపడింది. రామమందిరం అనేది దేశ ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశమని, దానిని కేవలం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేరని పేర్కొంది. మందిర నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీచేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రికలో శనివారం కథనాన్ని ప్రచురించింది. హిందూవుల ఆంకాంక్ష అయిన రామమందిరాన్ని 25 ఏళ్లుగా ఎందుకు నాన్చుతూవున్నారని సేన ప్రశ్నించింది.
‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు.
అయోధ్యలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు!
Comments
Please login to add a commentAdd a comment