
మంచి నిద్రకు యోగా...
ధ్యానమార్గం
అమెరికాలో ఇప్పుడు యోగాకు మంచి ఆదరణ లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కంటే కూడా మంచి నిద్రకు ఇది ఉపయోగపడుతోందని అక్కడి అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ధ్యానం వల్ల నిద్రలేమిని సులభంగా పోగొట్టవచ్చని అక్కడ వైద్యులు పేషంట్లకు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, కీళ్ల నొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్, పార్కిన్‌సన్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్నవారు ధ్యానం ద్వారా సుఖ నిద్రను పొందవచ్చని చెబుతున్నారు.
శ్వాస మీద దృష్టి పెట్టి సుఖాసనంలో కూర్చుని పాజిటివ్ సంకల్పం తీసుకుంటూ ఉంటే నిద్ర దానికదే వస్తుందట. వెల్లికిలా పడుకుని ఒక చేయి పొత్తి కడుపు మీద మరో చేయి ఛాతీ మీద ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టి మెల్లగా లోనికి తీసుకుంటూ బయటకు వదులుతూ రిలాక్స్ అవుతున్నట్టుగా భావిస్తూ మనసు తేలిక పడుతున్నట్టు ఊహించుకుంటే నిద్ర రావడం ఖాయమని అక్కడి నిపుణులు తెలుపుతున్నారు.