ఆలోచనలు కాస్త గందరగోళంగా ఉన్నపుడు ఒక 15-20 సార్లు గట్టిగా గాలిపీల్చడం ద్వారా మీరు సత్వరం ఉపశమనం పొందొచ్చు.
వరుసగా కొంతకాలం పాటు ఏదైనా ప్రాజెక్టులో లేదా పనిలో బిజీగా గడిపితే లైట్ రీడ్ పుస్తకం ఒకటి కొనుక్కుని దాన్ని ఏకధాటిగా కంప్లీట్ చేయవచ్చు. ప్రతిరోజూ ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగం చేస్తుంటే మీకు డ్యాన్స్ (యూట్యూబ్ సాయంతో నచ్చింది నేర్చుకోండి), 10 నిమిషాల ధ్యానంతో సమానం.
నైజీరియా గురించి ఓ నిజం!
ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్‌ది మొదటి స్థానం. ఆ తర్వాత అంత పెద్ద సినిమా ఇండస్ట్రీ మనదే అని కొందరనుకుంటున్నారట. ఒకవేళ మనది కాకపోతే ఏ యూరోపియన్ కంట్రీదో అయి ఉంటుంటుందని కూడా అనుకునే వారు లేకపోలేదు. కానీ ప్రపంచంలో హాలీవుడ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ ఆశ్చర్యకరంగా ఆఫ్రికా ఖండంలోని నైజీరియాకు చెందిన ‘నాలీవుడ్’ది. ఇక్కడ ఏడాదికి వెయ్యి సినిమాలు తీస్తారట. ఈ పరిశ్రమది ప్రపంచంలో రెండో స్థానమైతే, ఆఫ్రికాలో మొదటి స్థానం. ఈ సినిమాలు ఆఫ్రికా, యూరప్‌లతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కూడా పాపులరట.
కిచిడీ: ఒత్తిడిని తరిమేసే మూడు మార్గాలు
Published Sun, Jan 19 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement