
శివం.. సుందరం
మహాశివరాత్రి పర్వదినం.. జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఓంకారనాదం ప్రతిధ్వనించాయి.. శివపంచాక్షరీ జపంతో శ్రీశైలం పులకించింది. వేకువజాము నుంచే పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కృష్ణమ్మకు వాయినాలు సమర్పించి తమను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. క్షేత్రంలో సాయంత్రం ప్రభోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రాత్రి ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలను నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో మల్లన్న పాగాలంకరణ ఘట్టం కొనసాగింది.