ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు 45 ఏళ్ల వ్యాపారి రోహిత్ దత్తా పూర్తిగా కోలుకొని బయటపడ్డారు. ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 బారి నుంచి తానెలా బయటపడిందీ వివరించారు. కరోనా సోకిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో సూచించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. అది కాసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రోహిత్ దత్తా మాట్లాడుతూ..ఆసుపత్రిలో ఉన్న 14 రోజులూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవాడినని వివరించారు. ఈ రెండింటితోనే తాను ఈ మహమ్మారి గండం నుంచి గట్టెక్కానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వీటిని అభ్యాసం చేయాలని సూచించారు.
కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని పేర్కొన్న రోహిత్ దత్తా యోగా, ప్రాణాయామం, మానసిక స్థైర్యం.. కరోనాను ఓడించేందుకు ఈ మూడే కీలకమన్నారు. రోహిత్ దత్తా ఫిబ్రవరి 24 న యూరప్ నుండి తిరిగి వచ్చారు. తర్వాత జ్వరంగా ఉండటంతో స్థానికి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.దీంతో హాస్పిటల్‌లోనే క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వైద్యసిబ్బంది బాగా చూసుకున్నారని వివరించారు. తనను తాను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచుకున్నట్టు తెలిపారు. సామాజిక దూరం పాటించాలని, ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై అవగాహన కలిగి ఉండాలని రోహిత్ దత్తా సూచించారు. కాగా, వేడినీళ్లు తాగాలని, రోజులో కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది
Comments
Please login to add a commentAdd a comment