వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత కొద్దిరోజుల క్రితం సిఫార్సు చేసింది. అయితే, ఈ విధానాన్ని డాక్టర్ లివర్ డాక్ తప్పుపట్టడమే కాకుండా సమంత పట్ల పలు విమర్శలు చేశారు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని, ఆమెను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశారు. దీంతో సమంత కూడా ఆయన వ్యాఖ్యలను తప్పపడుతూ ఒక లేఖను విడుదల చేసింది. తాజాగా సమంతకు క్షమాపణలు చెబుతూ డాక్టర్ లివర్ డాక్ పలు వ్యాఖ్యలు చేశారు.
'సమంత చెప్పిన ఆరోగ్య సూచనను నేను ఖండించిన తీరు ఆమెకు నచ్చినట్లు లేదు. నా వ్యాఖ్యలతో ఆమె బాధపడినట్లు ఉన్నారు. అందుకు క్షమించమని సమంతను నేనే కోరుతున్నాను. కావాలని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అది అనుకోకుండా అలా జరిగిపోయింది. సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమెను తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. ఆమెకు ఇలాంటి చికిత్స సూచించిన డాక్టర్‌దే అసలైన తప్పు. సదరు డాక్టర్ కూడా తన సొంత లాభం చూసుకున్నారు.
ఈ క్రమంలోనే సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హనికరమైన హెల్త్ టిప్‌ను ప్రజలకు చేరవేస్తున్నారు. సమంతకు చికిత్స అందించే డాక్టర్‌పై పలుకేసులు ఉన్నాయి. ఆయన ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కాదు, ప్రకృతి వైద్యుడు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ఆయన ప్రోత్సహించడంతో గతంలో ఆయనపై ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంది. అందుకే నేను ఆ డాక్టర్ సూచించిన వైద్యాన్ని ఖండించాను.' అని లివర్ డాక్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment