రెడ్‌లైట్‌ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్‌ ఇదే..! | Samantha Ruth Prabhu Choose Red Light Therapy For Healthy Skin Benefits | Sakshi
Sakshi News home page

రెడ్‌లైట్‌ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!

Sep 13 2024 11:00 AM | Updated on Sep 13 2024 12:53 PM

Samantha Ruth Prabhu Choose Red Light Therapy For Healthy Skin Benefits

టాలీవుడ్‌ నటి సమంత రూత్‌ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేశావే సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా క్రేజ్‌ సంపాదించుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి సమంత ఎప్పటికప్పుడూ ఫిట్‌నెస్‌, ఆరోగ్యం సంబంధిత వీడియోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. 

తాజాగా ఈసారి తన చర్మ సంరక్షణ కోసం తన రోజువారి దినచర్యలో భాగంగా తీసుకునే థెరపీ గురించి ఇన్‌స్టాలో చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోకి "లైఫ్‌ గోల్డెన్‌" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేసింది. సమంత మచ్చలేని చర్మ రహస్యం ఏంటో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన చర్మం ప్రకాశవంతంగా డిస్కోబాల్‌ మాదిరిగా మెరుస్తూ ఉండేందుకు తాను ఉదయపు సూర్యకాంతిని తన ముఖంపై పడేలాచేసుకుంటానని అంటోంది. అంతేగాదు ఆయిల్‌ పుల్లింగ్‌, గువాషా, రెడ్‌లైట్‌ థెరపీలతో ముఖ వర్చస్సును కాపాడుకుంటానని చెబుతోంది. 

అలాగే తన రోజువారీ వెల్‌నెస్‌ రొటీన్‌లో భాగంగా రెడ్‌లైట్‌ థెరపీని తీసుకుంటానని తెలిపింది. ఇది కంటి సంరక్షణ తోపాటు చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ రెడ్‌లైట్‌ థెరపీకి సంబంధించిన ఐ మాస్క్‌ల, ఫేస్‌ మాస్క్‌లు, ఫుల్‌ బాడీ ప్యానెల్‌ వంటి అనే సాధనాలు మార్కెట్లో ఉన్నాయి. దీని కోసం బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లోనే చర్మ వ్యాధుడి నిపుణుడి సలహాలతో తీసుకోవచ్చని అంటోంది సమంత. దీన్ని ఉదయం సాయంత్రంలో తీసుకుంటుంటే క్రమేణ చర్మం ఆకృతి మెరుగుపడుతుందని చెప్పింది.  ఈ థెరఫీని ఇంట్లోనే పొందేలంటే ఉపయోగించాల్సిన పరికరాలు గురించి కూడా వెల్లడించింది.  

ఫోరో యూఎఫ్‌ఓ 2 పరికరం అనేది కొల్లాజెన్‌ని పెంచేలా చేసే రెడ్‌లైట్‌ థెరపీ పరికరం. ఇది క్రియోథెరపీని కలిగి ఉంటుంది. చర్మాన్ని విశ్రాంతి తీసుకునేలా చేసి గొంతు కండరాలకు ఉపశమనం కలిగించే హ్యాండ్‌హెల్డ్ పరికరం. ఇక మరొకటి డెన్నిస్‌ గ్రాస్‌ డీఆర్‌ఎక్స్‌ స్పెక్ట్రాలైట్‌ ఫేస్‌వేర్‌ప్రో అనేది నాలుగు రకాల లైట్లను కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధ హ్యాండ్స్‌ ఫ్రీ రెడ్‌లైట్‌ పరికరం. ఇది ముఖ ఆకృతులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడమే గాక మొటిమలు, దాని తాలుకా గుర్తులను రీమూవ్‌ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. 

అలాగే ముఖం, మెడను లక్ష్యంగా చేసుకుని మాన్యువల్‌గా పనిచేసే పోర్టబుల్‌ రెడ్‌లైట్‌ థెరపీ కావాలనుకుంటే సోలావేవ్‌ 4 ఇన్‌ 1 రేడియంట్‌ రెన్యూవల్‌ స్కిన్‌కేర్‌ బెస్ట్‌ అని చెబుతోంది. ఇది ఎర్రటి కాంతిని చర్మంపై ప్రసరించేలా చేసి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా ముఖం ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. 

 

ఈ థెరపీతో కలిగే ప్రయోజనాలు..

  • రెడ్‌లైట్‌ థెరపీ చర్మంపై ముడతలు, ఫైన్‌లైన్స్‌, వయసు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది. 

  • ముఖ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టోన్డ్‌ స్కిన్‌ను ప్రోత్సహిస్తుంది. 

  • చర్మం ఉపరితలంపై మచ్చలు, సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపడేలా చేస్తుంది.

(చదవండి: ఫరా ఖాన్‌ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement