వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత సిఫార్సు చేసింది. దీనిని డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదుని ఆయన హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు. తాజాగా ఈ అంశం గురించి సమంత ఒక సుదీర్ఘమైన లేఖను రాసింది.
"గత రెండు సంవత్సరాలుగా, నేను అనేక రకాల ఔషధాలను తీసుకోవలసి వచ్చింది. నేను తీసుకోవాలని గట్టిగా సూచించిన ప్రతిదాన్ని ప్రయత్నించాను. పేరు పొందిన నిపుణులు పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినట్లుగా ఉపయోగించాను. ఈ చికిత్సలు చాలా చాలా ఖరీదైనవి కూడా. నేను దానిని భరించగలిగినందుకు నేను ఎంత అదృష్టవంతురాలిని. ఇంతటి ఖర్చును భరించలేని వారి గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సాంప్రదాయ చికిత్సలు నా ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం లేదు. కానీ, ఇవి ఇతరలకు బాగా పనిచేసి ఉంటాయని నేను ఖచ్చితంగా భావిస్తాను.
చికిత్సా విధానాన్ని గట్టిగా వాదించేంత అమాయకురాలిని కాదు. గత రెండు సంవత్సరాలలో నేను ఎదుర్కొన్న, నేర్చుకున్న వాటిని మంచి ఉద్దేశ్యంతోనే సూచించాను. ముఖ్యంగా చికిత్సలన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. కాబట్టి వాటిని అందరూ పాటించకపోవచ్చు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేయడానికి మనమందరం విద్యావంతులైన వైద్యులపై ఆధారపడతాము. ఈ చికిత్స గురించి నాకు పేరుపొందిన డాక్టరే సూచించారు. ఆయన 25 సంవత్సరాలుగా DRDOలో సేవలందించిన ఒక ఉన్నతమైన వైద్యుడు.
'ఒక పెద్దమనిషి నా పోస్ట్‌పై, నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. పెద్దమనిషి కూడా వైద్యుడేనని అన్నారు. అతనికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా గురించి మాట్లాడిన అతని ఉద్దేశాలు గొప్పవని నాకు ఖచ్చితంగా తెలుసు. అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల గౌరవాన్ని పెంచేది. ముఖ్యంగా నన్ను జైలులో వేయాలని ఆయన సూచించాడు. పర్వాలేదు. నేను సెలబ్రిటీ అనే కోణంలో ఆయన అన్నారని అనుకుంటున్నాను.
నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వారికోసం ఒక వ్యక్తిగా పోస్ట్ చేశాను. నేను ఖచ్చితంగా ఈ పోస్ట్ నుండి డబ్బు సంపాదించడం లేదు.. ఇదే చేయండి అని నేను ఆమోదించడం లేదు. సాంప్రదాయ ఔషధం పని చేయని వారు మరోదారి కోసం వెతుకుతారు. అలాంటి వారి కోసం నేను ఈ చికిత్స ఒక ఎంపికగా సూచించాను.'
లివర్ డాక్ తనను టార్గెట్ చేయడం కంటే తన డాక్టర్‌తో ఇదే చర్చ జరిపి ఉంటే బాగుండేదని సమంత అన్నారు. 'నేను ట్యాగ్ చేసిన డాక్టర్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి చర్చ జరిపితే బాగుంటుంది. ఇద్దరు అధిక అర్హత కలిగిన నిపుణుల మధ్య చర్చ జరిగితే దాని నుంచి నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను.
నా ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి ఉన్న సమాచారాన్ని ఇతరులతో పంచుకుని వారికి సహాయం చేయడమే నా ఉద్దేశం.. ఎవరికీ హానీ కలిగించడానికి కాదు. ఇక నుంచి నేను కూడా మరింత జాగ్రత్తగా ఉంటాను. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ మొదలైనవాటిని సూచిస్తున్న వ్యక్తులు నాకు చాలా మంది ఉన్నారు. నేను వాటన్నింటినీ విన్నాను. కానీ, నేను మాత్రం దీనినే పాటిస్తున్నాను.' అని సమంతప్పింది. కొందరి అనారోగ్య ప్రొఫైల్ బట్టి చికిత్సలు ఉంటాయి కాబట్టి.. ఎవరైనా దీనిని పాటించాలంటే సంబంధించిన వైద్యుల సలహాలు తీసుకున్న తర్వాతే అనుసరించడం మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment