నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌.. టాప్‌లో శోభితా ధూళిపాళ్ల | Sobhita Dhulipala Beat Shah Rukh Khan IMDB Rating | Sakshi
Sakshi News home page

నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌.. టాప్‌లో శోభితా ధూళిపాళ్ల

Published Tue, Aug 13 2024 8:59 AM | Last Updated on Tue, Aug 13 2024 12:46 PM

Sobhita Dhulipala Beat Shah Rukh Khan IMDB Rating

అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఎంగేజ్‍మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేవలం వారి రెండు కుటుంబాల మధ్య  మాత్రమే నిశ్చితార్థం జరిగింది. దీంతో వారిద్దరి టాపిక్‌ దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయింది. అయితే, ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల జాబితాలో శోభిత ధూళిపాళ్ల టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.

ఈ వారం పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ను IMDB (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) తాజాగా విడుదల చేసింది. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన తర్వాత నటి శోభిత ఒక్కసారిగా రెండో స్థానంలో నిలిచింది. నాగచైతన్యతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆమె సిద్ధం కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. వారిద్దరి గురించి మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు గూగుల్‌ సర్చ్‌ చేశారు.

షారూఖ్‌ను దాటేసిన శోభిత
ఐఎండీబీ జాబితా ప్రకారం ఈ వారం ప్రథమ స్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ నిలిచింది. ముంజ్యా మూవీ విజయం తర్వాత ఆమె క్రేజ్‌ భారీగా పెరిగింది. చైతుతో ఎంగేజ్‍మెంట్  వల్ల రెండో స్థానంలోకి శోభిత  వచ్చేసింది.  షారూఖ్‌​ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు.  ఈ జాబితాలో బాలీవుడ్​ సీనియర్ నటి కాజోల్, యంగ్​ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.  బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ తర్వాత స్థానాల్లో వరుసగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement