టాప్‌-3లో రష్మిక.. అల్లు అర్జున్‌ను దాటేసిందిగా! | Rashmika Mandanna Third Place In IMDB Rankings Crossed Allu Arjun | Sakshi
Sakshi News home page

Rashmika: ఆ లిస్ట్‌లో రష్మికకు మూడోస్థానం.. బన్నీని వెనక్కినెట్టిన శ్రీవల్లి!

Published Sat, Apr 15 2023 10:09 PM | Last Updated on Sat, Apr 15 2023 10:17 PM

Rashmika Mandanna Third Place In IMDB Rankings Crossed Allu Arjun - Sakshi

నేషనల్ క్రష్, కన్నడ భామ 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ కావడంతో రష్మిక దశ ఒక్కసారిగా తిరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పతో నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ కేటగిరిలో శ్రీవల్లి చోటు సంపాదించుకుంది. ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్‌-3లో నిలిచింది. రష్మిక ఈ లిస్టులోకి ఎంట్రీ అవ్వడం ఇదే మొదటిసారి. ఈ జాబితాలో అల్లు అర్జున్‌ 17వ ప్లేస్‌లో నిలిచారు.

తాజాగా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులోకి కొత్తగా డెబ్యు ఇచ్చిన వాళ్లలో వెట్రిమారన్, అల్లు అర్జున్, నాని, కీర్తి సురేష్, తమన్నా, కరీనా కపూర్, సారా అలీ ఖాన్ కూడా ఉన్నారు. నాని, కీర్తి సురేశ్‌ల దసరా సినిమా హిట్ కావడంతో పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా మారారు. కాగా.. ప్రస్తుతం రష్మిక సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక బర్త్‌డే సందర్భంగా ‘పుష్ప2’ గ్లింప్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement