ఆ హీరోయిన్‌ గురించి రహస్యంగా అలా అనుకునేదాన్ని: సమంత | Viral: Actress Samantha Reveals About Her Opinion On Deepika Padukone | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ను కాపీ కొడతాను: సమంత

Jun 11 2021 2:01 PM | Updated on Jun 11 2021 3:22 PM

Viral: Actress Samantha Reveals About Her Opinion On Deepika Padukone - Sakshi

ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎంతో అందంగా ఉంటుందని, ఆమె మనిషి రూపంలో ఉండే దేవత అని రహస్యంగా అనుకునేదాన్నని చెప్పుకొచ్చింది. 

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత అంటే పడిచచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. తన నటనతో, అందచందాలతో ఎంతోమందిని బుట్టలో వేసుకుందీ సుందరి. ఎంతోమందికి ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలిచే సామ్‌ తనకు మాత్రం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ స్ఫూర్తి అని చెప్తోంది. దీపికా పదుకోన్‌ స్టైలింగ్‌ తనకు ఎంతో ఇష్టమని బాహాటంగానే ఒప్పేసుకుంది.

తాజాగా సమంత జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను దీపిక పదుకోన్‌ను కాపీ కొడతానని అంగీకరించింది. దీపిక ఎంతో అందంగా ఉంటుందని, ఆమె మనిషి రూపంలో ఉన్న దేవతనా? అని రహస్యంగా అనుకునేదాన్నని చెప్పుకొచ్చింది. ఆమె ఫ్యాషన్‌ అంటే ఎంతో ఇష్టమన్న సామ్‌ దాన్ని ఫాలో అవుతానని తెలిపింది.

కాగా సమంత తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌ 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'కు విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో నటించిన నటీనటులందరికీ మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. ఇదిలా వుంటే సామ్‌ ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్‌’ అనే సినిమాలోనూ నటిస్తోంది.

చదవండి: ఆ హీరోతో నటించాలనుంది : సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement