మస్క్‌ వర్సెస్‌ మడురో: ఆయన గెలిస్తే గనుక.. | Elon Musk Accepts Dare To Fight Venezuela President | Sakshi
Sakshi News home page

మస్క్‌ వర్సెస్‌ మడురో: ఆయన గెలిస్తే గనుక..

Published Thu, Aug 1 2024 9:37 AM | Last Updated on Thu, Aug 1 2024 10:37 AM

Elon Musk Accepts Dare To Fight Venezuela President

వెనిజులా అధ్యక్షుడు(నూతన)నికోలస్‌ మడురో విసిరిన సవాల్‌కు ప్రపంచ బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ స్పందించారు. మడురోపై పోటీకి తాను సిద్ధమని అన్నారాయన. పోటీకి ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎక్స్‌ వేదికగా ప్రకటించారాయన.

నాతో పోరాడాలనుకుంటే బరిలో దిగమని మస్క్‌కు నికోలస్‌ మడురో సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా సీఈవో మస్క్‌ తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎక్కడ పోటీ అంటే అక్కడికి వస్తానని, తన వెంట మడురో ప్రియమైన గాడిదను కూడా తీసుకొస్తానంటూ వ్యంగ్యంగా బదులిచ్చారాయన. ఒకవేళ మడురో ఓడిపోతే.. ఆయన రాజకీయ సన్యాసం చేయాలి. తాను ఓడిపోతే గనుక ఉచితంగా ఆయన్ని మార్స్‌ ప్రయాణానికి తీసుకెళ్తానని స్పేస్‌ ఎక్స్‌ అధినేత ప్రకటించారు. 

వెనిజులా ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. అయితే ఆయన అప్రజాస్వామ్యిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మస్క్‌ మద్దతు ఇవ్వడంతో.. మడురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్‌ కంప్యూటర్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement