USA: ఇరవై ఏళ్ల తర్వాత చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ | After 20 years Americas Most Wanted Fugitive El Diablo Arrested | Sakshi
Sakshi News home page

USA: ఇరవై ఏళ్ల తర్వాత చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌

Published Tue, Aug 6 2024 8:04 AM | Last Updated on Tue, Aug 6 2024 9:25 AM

After 20 years Americas Most Wanted Fugitive El Diablo Arrested

న్యూయార్క్‌: అమెరికా మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌, 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు ఒకరిని ఫేస్‌బుక్‌ పట్టిచ్చింది. 2004లో ఎల్‌డియాబ్‌లో రియానో అనే క్రిమినల్‌  ఒహియోలోని బార్‌లో ఓ వ్యక్తిపై  కాల్పులు జరిపి పారిపోయాడు. అప్పటి నుంచి రియానో పోలీసుల మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు.

తాజాగా ఫేస్‌బుక్‌ చూస్తున్న అమెరికా పోలీసులకు మెక్సికోలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి రియానో పోలికలకు దగ్గరగా ఉండటాన్ని గమనించారు. ఇంకేముంది వెళ్లి చూస్తే  ఆ పోలీసు అధికారి రియానో అని తేలింది. దీంతో వెంటనే అతడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని సిన్సినాటిలోని బట్లర్‌ కౌంటీ జైలులో ఉంచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement