VS
-
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.👉: “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి. -
అప్పుడు ఆలా.. ఇప్పుడు ఇలా..
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ దాఖలు
-
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ..!
-
ఆకుట్టుకున్నాడు..
గాన గంధర్వుడు ఎస్పీ బాలు గళం.. నటుల గళాన్ని అనుసరిస్తూ సాగుతుంది. సెలబ్రిటీ టైలర్‌గా పేరొందిన మురళి కూడా అంతే.. మనుషుల రూపురేఖల్ని బట్టి అందంగా ఆహార్యాన్ని రూపుదిద్దుతాడు. ఒక్కసారి టైలర్ గారి పనితనం చూపిన డ్రెస్ వేసుకుంటే.. సదరు వ్యక్తికి అదే అ‘డ్రెస్’గా సెట్ అయిపోతుంది. అబిడ్స్.. రద్దీగా కనిపించే ఈ ప్రాంతంలో.. ఎన్నో డిజైనర్ షోరూమ్‌లు అద్దాల మేడల్లో మెరిసిపోతుంటాయి. ఇక్కడి మయూర్ కుశాల్ కాంప్లెక్స్ తొలి అంతస్తులోని బి-బ్లాక్‌లో ఉంటుందీ టైలర్ కొట్టు. మెడలో ఓ టేప్ వేసుకుని.. సాదాసీదాగా కనిపించే మురళి.. కొలతలు తీసుకున్నాడా..! మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ బాడీకి కరెక్ట్‌గా సెట్ అయ్యే విధంగా డ్రెస్ కుట్టిపెడతాడాయన. ఈయన పనితనం ఒక్కసారి చూస్తే.. ఎవరూ ఆయనను వదిలిపెట్టరు. అంత అందంగా ఒంటిపై ఒదిగిపోతాయి ఈయన కుట్టిన డ్రెస్‌లు. ఈయన లిస్ట్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. 15 ఏళ్లపాటు వెంకయ్యనాయుడు ఈయన కుట్టిన చొక్కాల్లోనే తళుక్కుమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, ఒకప్పటి డీజీపీ సుకుమార్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి (రిటైర్డ్), ఇంకా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు, మార్వాడీ, అగర్వాల్ ప్రముఖులు కూడా మురళి కుట్టిన జోతలకు జేజేలు పలికిన వారిలో ఉన్నారు. ఆయన కుట్టుబాటుతనం అలాంటిది మరి. ఈయనకు జంట రాష్ట్రాల నుంచే కాదు.. విదేశీ కస్టమర్లు కూడా ఉన్నారంటే దర్జీగా ఆయన దర్జా ఏంటో తెలుస్తుకోవచ్చు. ఓ సినిమాలో నాగార్జున కాస్ట్యూమ్స్ ఈయనే రూపొందించాడు. అలాగే డెలాయిట్ కంపెనీ ఉద్యోగులకు కొన్నాళ్ల పాటు ఈయనే డ్రెస్‌లను కుట్టి పెట్టారు. రేమాండ్ అడ్డాగా.. మెదక్ జిల్లా జిన్నారానికి చెందిన మురళీధర్ చిన్నప్పటి నుంచే కుట్టు మిషన్‌పై కదం తొక్కేవాడు. 1990లో అబిడ్స్‌లోని సుమంగళ్ రేమాండ్ షోరూమ్‌లో టైలరింగ్ విభాగంలో హెడ్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2010లో ఆ షాప్ మూతపడటంతో తనే సొంతంగా టైలర్ షాప్ ప్రారంభించాడు. రేమండ్కు అనుబంధంగా 20 ఏళ్లపాటు పనిచేయడంతో.. ఆ షోరూమ్‌కు వచ్చే ప్రముఖులందరూ మురళీ కస్టమర్లుగా మారిపోయారు. ఆయన పనితనం తెలిసిన వారు మాత్రం.. ఇప్పటికీ ఆయన షాపును వెతుక్కుంటూ వస్తున్నారు. -
స్వెట్ & బర్న్
కార్పొరేట్ ఉద్యోగం. జాలీగా సాగిపోతున్న జీవనం. అయినా ఏదో తెలియని వెలితి. ఇలా రొటీన్ లైఫ్‌కి భిన్నంగా ఏదైనా చేయాలనుకుంది. 18 ఏళ్ల కార్పొరేట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఫిట్నెస్ కోసం స్టెప్స్ వేసింది. శరీరం సహకరించక ఇబ్బందులు ఎదురైనా... అవలీలగా అధిగమించి ఇప్పుడు సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, ఏరోబిక్స్ అండ్ జుంబా ట్రైనర్‌గా మారింది. ఆమె జాక్వలిన్ బబితా జేవియర్. డిప్రెషన్‌నుంచి బయటపడేందుకు ఈ హైదరాబాదీ మొదలుపెట్టిన పరుగు... ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. 44 ఏళ్ల వయసులో అథ్లెట్‌గా మారి, ఇద్దరు పిల్లల తల్లిగా విజయపథంలో దూసుకెళ్తూ మేరీకోమ్‌ను తలపిస్తున్న బబిత పరిచయం... రెస్టారెంట్ నిర్వహిస్తున్న భర్త. ఇద్దరు పిల్లలు. మంచి ఉద్యోగం. జాబ్ చేసుకుంటూనే పిల్లల ఆలనాపాలన చూస్తున్న బబితకు ఇది రొటీన్ అనిపించింది. వ్యక్తిగతంగా ఏదో సాధించాలన్న ఆలోచన వచ్చింది. అందుకోసం ఫిట్నెస్ రంగాన్ని ఎంచుకుంది. అలా 2011లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ దగ్గర ఏరోబిక్ పాఠాలు నేర్చుకున్న ఆమె... రెండేళ్ల పాటు ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేసింది. గతేడాది సైనిక్‌పురిలో ‘స్వెట్ ఎన్ బర్న్ ఫిట్నెస్’ స్టూడియోను ప్రారంభించి ఫిట్నెస్ గురువుగా మారిపోయింది. అయితే కేవలం ఫిట్నెస్ ట్రైనర్‌గానే ఉండిపోతే ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయేది. గతేడాది... ఎంతో ప్రీతిపాత్రంగా ఉండే ఓ స్నేహితురాలు ఆమెను అవమానించింది. అది బబితను డిప్రెషన్లోకి తీసుకెళ్లింది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు రన్నింగ్ మొదలు పెట్టింది. మనస్సు కాస్త కుదుటపడింది. ఒత్తిడికి దూరం అయ్యింది. అలా ప్రారంభించిన రన్ ఈ రోజు ఆమెను జాతీయస్థాయి క్రీడాకారిణిగా నిలబెట్టింది. కాన్ఫిడెన్స్ పెంచింది... ‘2014 జనవరి 5న శామీర్‌పేట బిట్స్‌పిలానీ దగ్గర హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన అలంకృత బ్రేక్‌ఫాస్ట్ రన్‌కు వెళ్లా. సరదాగా ఐదు కిలోమీటర్లు పరుగెత్తి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంలే అనుకున్నా. అక్కడికెళ్లాక ఏకంగా 21 కిలోమీటర్ల పరుగెత్తా. ఆ ఫిట్నెస్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నాలో కాన్ఫిడెన్స్ కూడా పెంచింది. గతేడాది మార్చి 9న హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన క్లబ్న్ల్రో 40 ప్లస్ కేటగిరిలో పరుగెత్తా. రెండు గంటల 14 నిమిషాల్లో 21 కిలోమీటర్లు రన్చేసి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నా. ఆ తర్వాత చెన్నై ట్రెయిల్ రన్లో సెకండ్ ప్రైజ్, కొచ్చిన్ మారథాన్లోనూ రెండో స్థానంలో నిలిచా. బెంగళూరులో జరిగిన రన్‌లోనూ పాల్గొన్నా. హైదరాబాద్ మారథాన్‌లో నా పిల్లలతో కలిసి పార్టిసిపేట్ చేశా’ అని చెబుతుంది బబిత. గర్వంగా ఉంది... గతేడాది నవంబర్‌లో కరీంనగర్లో డిస్ట్రిక్స్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ జరుగుతుందని తెలిసి బబిత పాల్గొన్నది. 1500 మీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగంలో మూడు బంగారు పతకాలు వచ్చాయి. ఆ ఆత్మవిశ్వాసంతో హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు వెళ్లింది. అక్కడా 35 ప్లస్ కేటగిరి ఐదు కిలోమీటర్ల విభాగంలో కాంస్యపతకం, పది కిలోమీటర్లు, 1500 మీటర్ల విభాగంలో రజత పతకాలు దక్కించుకుంది. ‘నన్ను కుంగదీసేందుకు అన్న మాటలే నాకు ప్రేరణగా నిలిచాయి. నన్ను జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మార్చాయి. వెనక్కి తిరిగి ఈ ప్రయాణాన్ని చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది’ అని ధీమాగా చెబుతుంది బబిత. లేటు వయసులో అథ్లెట్‌గా రాణిస్తూనే, ఫిట్నెస్ ట్రైనర్‌గా దూసుకుపోతున్న బబిత భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం! - వీఎస్ -
డాక్టర్స్ లేన్...
సినిమాలకు క్రాస్‌రోడ్స్.. అమ్మాయిల షాపింగ్‌కు కోటి... ఇలా హైదరాబాద్‌లో కొన్ని అడ్డాలున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కేపీహెచ్‌బీలోని రోడ్‌నెంబర్ 4 చేరింది. ఆ గల్లీలో వందలాది క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోంలు, టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లు... ఇలా మనిషికి అవసరమయ్యే ప్రతి స్పెషాలిటీ క్లినిక్ కనబడుతుంటుంది. 2006కు ముందు ఏ మాత్రం చడిచప్పుడు లేని ఆ కాలనీ... ఇప్పుడు ఎటు చూసినా క్లినిక్‌ల మయమైంది. కొన్ని క్లినిక్‌లు ఆస్పత్రులుగా మారాయి. మెడికల్ షాప్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. 1991లో... మొదటిసారి విఘ్నేశ్ క్లినిక్, ఎస్వీఎస్ క్లినిక్ ఏర్పాటయ్యాయా గల్లీలో. అప్పుడు సాయంత్రం ఆరు దాటిందంటే ఎటు చూసినా చీకటే. కేవలం ఈ రెండు క్లినిక్‌లు కరెంట్ వెలుగులతో కనిపించేవి. ఏ రోగమొచ్చినా, ప్రసవాలైనా, రోడ్డు ప్రమాదంలో గాయాలైనా ఈ క్లినిక్‌లకు క్యూ కట్టేవారు. బొల్లారం, బాచుపల్లి, చందానగర్, మూసాపేట, లింగంపల్లి, పటాన్ చెరువు, ఆశోక్ నగర్, జీడిమెట్ల, సూరారం కాలనీవాసులకు ఈ క్లినిక్‌లే దిక్కు. ఆ రెండు తరువాతి రోజుల్లో విఘ్నేశ్ నర్సింగ్ హోమ్‌గా, ఎస్వీఎస్ చిల్డ్రన్ హాస్పిటల్‌గా మారిపోయాయి. కార్పొరేట్ హంగులతో రెడిమేడ్ ఆస్పత్రి రావడంతో కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 4 దశ తిరిగింది. ఈ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లే పార్ట్‌టైమ్‌గా ఈవెనింగ్ క్లినిక్‌లు ప్రారంభించారు. రోగులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆ లైన్ కాలక్రమేణా డాక్టర్ లేన్‌గా మారింది. ఇప్పుడు కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ నాలుగు అనేకంటే డాక్టర్స్ గల్లీ అంటేనే సులభంగా గుర్తు పడతారు. ఎందుకీ డిమాండ్... ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లినా కన్సల్టెంట్ ఫీజు... రూ. 500లకు తక్కువ లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కన్నా కన్సల్టెంట్ ఫీజు తక్కువ ఉండటం, రీజనబుల్ ధరలకే రూమ్‌లు దొరకడంతో వీటికి రోగుల తాకిడి పెరిగింది. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా వెలవడంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీప ప్రాంతాలైన కూకట్పల్లి, మియాపూర్‌లో నివాసాలు ఏర్పరుచుకోవడం, ఇతర జిల్లాలనుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ ఖర్చులు పెట్టలేక అందుబాటులో ఉన్న ఈ క్లినిక్లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రేటులోనే ట్రీట్మెంట్ పూర్తవడం, డాక్టర్ల గురించి ఎక్కువ సేపు వేచివుండాల్సిన అవసరం లేకపోవడం... వంటికారణాలన్నీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. టెస్టుల కోసం... ఎంతో దూరంనుంచి హాస్పిటల్‌కు వెళ్తే.. డాక్టర్ టెస్టులు రాస్తాడు. వాటికోసం మళ్లీ ఇంకెక్కడికో పరుగెత్తాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా... అన్ని పరీక్షలకు అవసరమైన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఈ లేన్‌లో ఉన్నాయి. కార్డియాల జిస్ట్, డెర్మటాల జిస్ట్, గ్యాస్ట్రాంటల జిస్ట్, గైనకాల జిస్ట్, హెమటాల జిస్ట్, నెఫ్రాల జిస్ట్, న్యూరోసర్జన్, అర్థోపెడిస్ట్, సర్జన్, యూరాల జిస్ట్, డెంటిస్ట్, ఐ స్పెషలిస్ట్... ఇలా ఒకటి కాదు... స్పెషలిస్ట్ క్లినిక్‌లు.. ప్రతి ఒక్కటీ కొలువుదీరాయిక్కడ. - వీఎస్ -
ఒంటి చేత్తో క్యూ‘ట్రి’క్
రూబిక్ క్యూబ్ అంటే రంగులు కలపడం వూత్రమే కాదు... ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచే పజిల్ కూడా. రూబిక్లో రంగులను కలపడం అంటే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే. ఎన్ని రకాలుగా క్యూబింగ్ చేయగలిగితే ఒకే సమస్యను అన్ని రకాలుగా పరిష్కరించినట్లు. ఇలాంటి రూబిక్ క్యూబ్ అందరూ చేస్తారు. అయితే వేగంగా చేయగలిగినప్పుడే మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికే ఈ స్పీడ్‌ను అందిపుచ్చుకున్న సిటీజన్ కృష్ణంరాజు గాదిరాజు ఒక చేతితో 24 గంటల పాటు వెయ్యికి పైగా క్యూబ్‌లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా దూసుకెళుతున్నాడు. ప్రసాద్ ఐమాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు క్యూబింగ్ మొదలెట్టడానికి ముందు ఈ యువకుడు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. ‘పాఠశాల స్థాయి నుంచే క్యూబిక్ సాల్వర్ ఈవెంట్లలో పాల్గొన్నా. కాళ్లతో కూడా చేశా. కొన్ని రికార్డులు కూడా సాధించా. తొలిసారిగా ఒక్క చేతితోనే వెయ్యికి పైగా క్యూబిక్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెప్పాడు. బెంగళూరులోని క్వింటిస్లో కెమికల్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న కృష్ణమ్ భారత్‌లో స్పీడ్ సాల్వింగ్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు ఈ రికార్డుకు శ్రీకారం చుట్టానన్నాడు. కెనడాకు చెందిన ఎరిక్ క్లమ్బ్యాక్ రెండు చేతులతో 5,800 క్యూబ్‌లు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్న కృష్ణంరాజుకు ఆల్ ది బెస్ట్. - వీఎస్