బాబూ.. డ్రామాలు కట్టిపెట్టు | babu.. stop your acting | Sakshi
Sakshi News home page

బాబూ.. డ్రామాలు కట్టిపెట్టు

Published Wed, Oct 19 2016 9:46 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

బాబూ.. డ్రామాలు కట్టిపెట్టు - Sakshi

బాబూ.. డ్రామాలు కట్టిపెట్టు

– చంద్రబాబుకు అబద్ధాలు ఫ్యాషన్‌ అయిపోయింది..
– బలవంతపు భూసేకరణ వద్దంటే అభివద్ధి నిరోధకులు అంటావు
– చంద్రబాబు.. అభివృద్ధి నిరోధకుడివి నువ్వా? మేమా?
– ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?
– కాలుష్య ఫ్యాక్టరీ వద్దంటే హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెడతారా?
– బాబూ డ్రామాలు కట్టిపెట్టి పద్ధతి మార్చుకో.. ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో
– గ్రామాల మధ్యలో ఫ్యాక్టరీ తొలగించి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా
– అలా కాదని చంద్రబాబు మాట వింటే ఆయనతోపాటే బంగాళాఖాతంలో కలిసిపోతారు
– ప్రజల కోసం అవసరమైతే ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కోర్టుకు వెళతాం
– అక్వా ఫుడ్‌ పార్క్‌ బాధితుల సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, భీమవరం :
‘అయ్యా.. చంద్రబాబూ మీకు అబద్ధాలు ఫ్యాషన్‌ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బందరు పోర్టుకు వేల ఎకరాలు భూ సేకరణ చేస్తారు. అమరావతిలో బలవంతంగా భూములు లాక్కుంటావు. భోగాపురం విమానాశ్రయానికి కూడా భూములు బలవంతంగా తీసుకుంటావు. ఇప్పుడు తుందుర్రులో కనీసం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చేస్తావు. అదేమని ప్రశ్నించే ప్రజలపై హత్యాయత్నం కేసులు పెడతావు. జైళ్లకు పంపుతావు. ప్రజలను భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకుంటావు. ఇది సరైంది కాదని ఎదిరించి చంద్రబాబు ఆగడాల్ని అడ్డుకుంటే అభివద్ధి నిరోధకులుగా ముద్రవేస్తాడు. అయ్యా.. చంద్రబాబు అభివద్ధి నిరోధకుడు నీవా? మేమా?  చంద్రబాబు ఇవన్నీ మార్చుకో. రాష్ట్రం కోసం పనిచేయడం నేర్చుకో’ అంటూ ప్రధా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా మెగా ఫుడ్‌ పార్క్‌ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడతామని వ్యతిరేకిçస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం, గ్రామాల్లో 144 సెక్షన్‌ పెట్టి పోలీసు వేధింపులకు దిగడంతో బాధితులకు అండగా ఉంటానంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తణుకు వెళ్లి అక్కడ సబ్‌జైలులో ఉన్న తుందుర్రు చెందిన ఆరేటి సత్యవతిని పరామర్శించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం తణుకు నుంచి రేలంగి, అత్తిలి, భీమవరం మీదుగా తుందుర్రులో ఆక్వా పార్క్‌ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అక్వా ఫుడ్‌పార్క్‌ బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం అబద్ధాలు ఆడినట్టే చివరకు ఫ్యాక్టరీ విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. 
 
ఎన్నికల నుంచి చంద్రబాబు అబద్ధాలే చెబుతున్నాడు
‘ఎన్నికల సందర్భంలో ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాడు. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక అబద్ధాలతో ప్రజలను మోసం చేశాడు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం అప్పులు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు రద్దు చేస్తానన్నాడు. చివరికి చదువుకున్న పిల్లల్ని కూడా వదల్లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. జాబు రాకపోతే నిరుద్యోగ భతి ఇస్తానని అబద్ధాలు చెప్పి ఏ ఒక్కటి సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ఫ్యాక్టరీని ప్రజలు అడ్డుకుంటుంటే మళ్లీ మోసం చేయడానికి పైపులైన్‌ వేస్తానని అబద్ధాలు చెబుతున్నాడు. ప్రై వేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే రూ.20 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చుపెట్టి షెడ్లు వేసుకున్నట్టు చెబుతున్నారు. అలాంటి ప్రై వేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీకి ప్రభుత్వ నిధులతో ఎలా పైపులైన్‌ వేస్తారు. ఒక పక్కన ఆ ఫ్యాక్టరీ వల్ల జీరో పర్సంట్‌ కాలుష్యం అని చెబుతున్న చంద్రబాబు ఫ్యాక్టరీ కలుషిత వ్యర్థాలను సముద్రంలోకి పంపించేలా పైపులైన్‌ వేస్తానని చెబుతున్నారు. అంటే ముడుపుల కోసం ఏ పని చేసేందుకైనా చంద్రబాబు వెనుకాడడు. లేదంటే ప్రజలను మోసం చేయడానికి పైపులైన్‌ వేస్తానని కొత్త డ్రామాలు అడుతున్నాడు. చంద్రబాబు గారూ.. పైపులైన్‌ డ్రామాలు కట్టిపెట్టండి’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.
 
సీఫుడ్‌ ఫ్యాక్టరీ కాలుష్యం అని తెలీదా?
‘ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3 వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది. కాలుష్య నియంత్రణ చట్టం సెక్షన్‌ 8 ప్రకారం సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఆరంజ్‌ కేటగిరీలో ఉందని, ఇది కాలుష్య కారకమని చంద్రబాబు తెలీదా? కాలుష్యం ఉందని మీకు తెలుసు కాబట్టే పైపులైను పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదే ఫ్యాక్టరీని పది కిలోమీటర్ల దూరంలోని మారిస్తే అక్కడ మనుషులు ఉండరు. సముంద్ర తీరంలో ఇదే ప్యాక్టరీ యజమానులకు 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత భూమిని ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా దాని వల్ల ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది. ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు కాస్తాకూస్తో వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గదం వస్తుంది. కాలువలు కలుషితం అయిపోవడం వల్ల చేను బతకదు, పొలాలు మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు.
 
బాబును నమ్ముకుంటే బంగాళాఖాతమే..!
పరిశ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబటిట పర్వాలేదు గానీ ఇక్కడైతే వీళ్ల పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్‌ రిక్వెస్ట్‌ ఒక్కటే. ఏదైనా ఫ్యాక్టరీని పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదష్టితో ఉండాలి. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదని చూడాలి. వీళ్ల లెక్కల ప్రకారం 15–20 కోట్లు పెట్టామంటున్నారు. ఈ షెడ్లును ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు. మహా అయితే పునాది పనులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు. ఫ్యాక్టరీ స్థలం మొత్తం పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్దవాతావరణం సష్టించారు. ఊళ్లో 144 సెక్షన్‌ పెట్టారు. యాజమాన్యాన్ని కోరుతున్నా ప్రజల అభిష్టం మరకు దీన్ని ఇక్కడి నుంచి తరలించండి. ఇక్కడ పబ్లిక్‌ హియరింగ్‌ జరగలేదు. ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు. వీటన్నింటి దష్టిలో పెట్టుకుని పెద్ద మనస్సుతో ఆలోచించి ఇక్కడి నుంచి తరలించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. కాదు కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. ఫ్యాక్టరీని తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 
 
రెండేళ్ల తరువాత మన ప్రభుత్వమే వస్తుంది..
చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమే అని గుర్తుపెట్టుకోంది. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. అప్పుడు ప్రజల అభిష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా ఫుడ్‌పార్క్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. సభలో పార్టీ నాయకులు, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వంకా రవీంధ్రనాథ్, గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement