Fact Check: తప్పులో కాలేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు | Ganta Srinivasa Rao Fake Campaign In Name Of Selfie Challenge | Sakshi
Sakshi News home page

Fact Check: తప్పులో కాలేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

Published Sun, Apr 23 2023 1:29 PM | Last Updated on Thu, Aug 17 2023 3:23 PM

Ganta Srinivasa Rao Fake Campaign In Name Of Selfie Challenge - Sakshi

2009లో ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న నాటి సీఎం రోశయ్య (ఫైల్‌) 

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): సెల్ఫీ ఛాలెంజ్‌ పేరుతో ఓ పోస్టు పెట్టి టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పులో కాలేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌  ఎదుట సెల్ఫీ దిగి టీడీపీ హయాంలో ఇలాంటివి ఎన్నో అద్భు­త భవనాలు నిర్మించాం.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్కటైనా నిర్మించారా అంటూ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ భవన నిర్మాణంలో అసలు వాస్తవాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు బయటపెట్టారు. గంటా చెప్పింది అవాస్తవమని తేల్చిచెప్పారు.

ఇదీ వాస్తవం.. 
ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌కు 14 ఏళ్ల కిందటే బీజం పడింది. భవిష్యత్‌ అవసరాల కోసం భారీ సీటింగ్‌ సామర్ధ్యంతో ఓ అధునాతన కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటి వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ, రిజిస్ట్రార్‌ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి (ప్రస్తుత వీసీ) నిర్ణయించారు. బీచ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న వర్సిటీ భూమిలో 2,500 సీటింగ్‌ సామర్థ్యంతో దాదాపు రూ.10 కోట్లతో కన్వెషన్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

అప్పట్లో నగరంలోనే అతి ఎక్కువ సీటింగ్‌ సామర్ధ్యంతో చూపరులను ఆకట్టుకొనేలా అత్యాధునిక డిజైన్‌తో దీని నిర్మాణం చేపట్టారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ భవన నిర్మాణం తొలి దశ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత వచ్చిన యూనివర్సిటీ వీసీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీని నిర్మాణంలో  రాజకీయ పారీ్టలకు ఎలాంటి ప్రమేయం లేదు. అయినా     గంటా శ్రీనివాసరావు టీడీపీనే ఈ భవనాన్ని నిర్మించిందంటూ అబద్ధపు ప్రచారం చేయడంపై ఆంధ్ర విశ్వవిద్యాలయ వర్గాలు మండి పడుతున్నాయి.
చదవండి: చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు?

గంటాకు మతిభ్రమించింది..
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మతి భ్రమించిందని వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. 2009లో అప్పటి సీఎం రోశయ్య ఈ భవనానికి శంకుస్థాపన చేసిన ఫొటోను ఆమె శనివారం విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement