Selfie Challenge
-
Friendship Day: ఓ.. మై ఫ్రెండ్ (ఫొటోలు)
-
Friendship Day: చెరగనిది మా స్నేహబంధం (ఫొటోలు)
-
ఓటేయండి.. సెల్ఫీ పంపండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తుండగా.. మంచి స్పందన లభిస్తోంది. ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు) మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్ చేయడమే. ఆ ఫొటోలను సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.గమనిక: పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు. -
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం. -
Fact Check: తప్పులో కాలేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఓ పోస్టు పెట్టి టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పులో కాలేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ ఎదుట సెల్ఫీ దిగి టీడీపీ హయాంలో ఇలాంటివి ఎన్నో అద్భుత భవనాలు నిర్మించాం.. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కటైనా నిర్మించారా అంటూ శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ భవన నిర్మాణంలో అసలు వాస్తవాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు బయటపెట్టారు. గంటా చెప్పింది అవాస్తవమని తేల్చిచెప్పారు. ఇదీ వాస్తవం.. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌కు 14 ఏళ్ల కిందటే బీజం పడింది. భవిష్యత్ అవసరాల కోసం భారీ సీటింగ్ సామర్ధ్యంతో ఓ అధునాతన కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటి వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి (ప్రస్తుత వీసీ) నిర్ణయించారు. బీచ్ రోడ్డును ఆనుకొని ఉన్న వర్సిటీ భూమిలో 2,500 సీటింగ్ సామర్థ్యంతో దాదాపు రూ.10 కోట్లతో కన్వెషన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో నగరంలోనే అతి ఎక్కువ సీటింగ్ సామర్ధ్యంతో చూపరులను ఆకట్టుకొనేలా అత్యాధునిక డిజైన్‌తో దీని నిర్మాణం చేపట్టారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ భవన నిర్మాణం తొలి దశ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత వచ్చిన యూనివర్సిటీ వీసీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీని నిర్మాణంలో రాజకీయ పారీ్టలకు ఎలాంటి ప్రమేయం లేదు. అయినా గంటా శ్రీనివాసరావు టీడీపీనే ఈ భవనాన్ని నిర్మించిందంటూ అబద్ధపు ప్రచారం చేయడంపై ఆంధ్ర విశ్వవిద్యాలయ వర్గాలు మండి పడుతున్నాయి. చదవండి: చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు? గంటాకు మతిభ్రమించింది.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మతి భ్రమించిందని వీఎంఆర్డీఏ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. 2009లో అప్పటి సీఎం రోశయ్య ఈ భవనానికి శంకుస్థాపన చేసిన ఫొటోను ఆమె శనివారం విడుదల చేశారు.