కాంగ్రెస్‌ మేనిఫెస్టో మొత్తం అబద్ధాలే: బీజేపీ | BJP Fire On Congress Party Loksabha Elections Nyay Patra Manifesto, Details Inside - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నిజంగానే పురాతన పార్టీ.. మేనిఫెస్టోలో అన్నీ అబద్ధాలే: బీజేపీ

Published Fri, Apr 5 2024 5:12 PM | Last Updated on Fri, Apr 5 2024 5:53 PM

Bjp Fire On Congress Loksabha Elections Manifesto - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఒక అబద్ధాల పుట్ట అని బీజేపీ విమర్శించింది.  ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది శుక్రవారం(ఏప్రిల్‌ 5) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఇచ్చిన హామీలేవీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెరవేర్చలేదని గుర్తు చేశారు. ‘ప్రతిపక్ష పార్టీ నిజంగానే అత్యంత పురాతన పార్టీ. ప్రస్తుతం తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతోంది.

‘ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకే కాంగ్రెస్‌ మేనిఫెస్టో తయారు చేసింది. కాంగ్రెస్‌ హయాంలో దవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. వృద్ధి తక్కువగా ఉంటుంది. మహిళలకు నగదు విషయంలో రాహుల్‌ గాంధీది ఒక మాట. ఖర్గేది ఒక మాట. ఇవన్నీ తప్పుడు హామీలే. మేనిఫెస్టోలో విదేశాల్లోని పలు ప్రాంతాల ఫొటోలు వాడుతున్నారు.

న్యూయార్క్‌లోని బఫెలో రివర్‌, థాయ్‌లాండ్‌ చిత్రాలు ఎందుకు వాడారు’అని త్రివేది ఫైర్‌ అయ్యారు. కాగా, శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్‌  మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కలిసి రిలీజ్‌ చేశారు. 

ఇదీ చదవండి.. పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారెంటీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో రిలీజ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement