హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం రోజు చంద్రబాబు ...కొన్ని పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లోని విషయాలన్నీ అబద్దాలేనని ఆమె గురువారమిక్కడ అన్నారు. ప్రతీ మాట ప్రజల్ని వంచించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏడాది మొదటి రోజే అబద్దాలు చెబితే ఎలా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మాటల గారడి పక్కనపెట్టి చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాబు పాలనంతా బాదుడే బాదుడు అని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు.
ఏడాది మొదటిరోజే.. అబద్దాలా?
Published Thu, Jan 1 2015 1:27 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement
Advertisement