సేవలపై కొత్తగా 0.5 శాతం వ్యవసాయ సెస్
పన్ను పరిధిలోని అన్ని సేవలపై ఈ ఏడాది జూన్ 1 నుంచి 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ విధించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగానికి నిధులు సమకూర్చేందుకు ఈ సెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే వ్యవసాయ పంపులు, ఎరువులపై ఎక్సైజ్ డ్యూటీని త గ్గిస్తామని, శీతల గిడ్డంగుల పరికరాలపై
దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించివేస్తామని తెలిపారు.
మొత్తంగా ఈ బడ్జెట్ రైతుకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. సాగులో ఆదాయం పెంచే దిశగా ఆలోచనలు చేయడం బడ్జెట్‌లో అతి ముఖ్యమైన అంశం. సాగులో మార్పు తేవడం కోసం విత్తు నాటారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. వీటి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించడం సబబుగా ఉంది. అలాగే కొత్తగా విధించిన వ్యవసాయ సెస్ ఆహ్వానించదగ్గది.
స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త