తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది.
రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్‌కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
అలాగే భారత్‌లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.
కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు.
చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!
Comments
Please login to add a commentAdd a comment