
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సొసైటీ (సెస్) ఎన్నికల్లో బీజేపీని ప్రజలు మళ్లీ తిరస్కరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అడ్డదారిలో గెలుపుకోసం బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారన్నారు.
సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయ త్నాలకు ఇది చెంపపెట్టులాంటిందన్నారు. వ్యవ సాయ మోటార్లకు మీటర్లు, ఉచిత విద్యుత్ రద్దు, సబ్సిడీ విద్యుత్ ఉండదని ప్రజలు భావించినందునే బీజే పీని తిరస్కరించారని పేర్కొ న్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ బీజేపీ పట్ల వ్యతిరే కత ఉందనేందుకు సెస్ ఎన్ని కల ఫలితాలే నిదర్శనమన్నారు.
సెస్ ఎన్నికల్లో విజయంతో బీఆర్‌ఎస్ నాయ కత్వం, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల కల్పన.. తదితరాలపై దృష్టి సారిస్తామన్నారు. రైతులు, కుల వృత్తుల వారికి, దళిత, గిరిజనులకు రాయితీలు ఇస్తూ, మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులు, నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment