పీయూకు ఖాళీల సెగ!
♦ పాలమూరు యూనివర్సిటీలోని బోధన విభాగంలో ఖాళీలు
♦ మన యూనివర్సిటీలు పీయూకు పోస్టుల మంజూరు..
♦ 17 ప్రొఫెసర్లు 34అసోసియేట్ ప్రొఫెసర్లు
♦ 68అసిస్టెంట్ ప్రొఫెసర్లు 16ప్రొఫెసర్లు
♦ 30అసోసియేట్ ప్రొఫెసర్లు 50అసిస్టెంట్ ప్రొఫెసర్లు
♦ 96మొత్తం ఖాళీలు..
మహబూబ్‌నగర్ నుంచి గంగాపురం ప్రతాప్‌రెడ్డి :
వెనుకబడిన పాలమూరు జిల్లాలో విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు ఉన్న ఏకైక విశ్వవిద్యాలయంపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. ఏళ్లుగా విద్యాలయాన్ని అధ్యాపకుల కొరత వేధిస్తున్నా.. పట్టించుకునేవారు లేరు. యూనివర్సిటీ ప్రారంభించి తొమ్మిదేళ్లయినా రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సీబీసీఎస్ (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) అమలు చేయడం సవాలుగా మారింది.
‘న్యాక్’ దూరం
నిబంధనల ప్రకారం అధ్యాపకుల భర్తీ లేకపోవడంతో న్యాక్ గుర్తింపు రాలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు అందక యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడింది.
అంతంతే సిబ్బంది..
ప్రస్తుతం 125 మంది కాంట్రాక్టు అధ్యాపకులు అకాడమిక్ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. సాధారణంగా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫె సర్లు నిర్దేశించిన విధంగా తక్కువ తరగతులు బోధిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ తరగతులు బోధిస్తున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నాటి నుంచి అధికారులు ప్రభుత్వానికి ఏటా అధ్యాపకుల కొరత విషయమై ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 125 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 23 మంది రెగ్యులర్ అ«ధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల్లో ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఇక గద్వాల పీజీ సెంటర్‌లో ఇద్దరు, కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో ఒకరు, యూనివర్సిటీ కళాశాలలో 20 మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. మిగతా వారంతా కాంట్రాక్టు సిబ్బందే.
23 నియామకాలే..
ఒక యూనివర్సిటీలో పీజీతో పాటు పలు పరిశోధన కోర్సు లు ప్రవేశపెడితే కచ్చితంగా ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసి యేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫె సర్లతో ఒక రీడర్ అవసరం. ఇలా ఒక డిపార్ట్ మెంట్‌కు దాదాపు ఏడుగురు అధ్యాపకులు అవసరం ఉంటారు. అయితే ఇక్కడి పరిస్థితు లు భిన్నంగా ఉన్నాయి. పీయూ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు కేవలం 23 మంది రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలే జరి గాయి. యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్ల యిన గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.
ఫార్మసీ, ఎంఈడీ విభాగాల్లోనూ..
పీయూకు అనుబంధంగా ఫార్మసీ, ఎంఈడీ కళాశాలలు న్నాయి. యూనివర్సిటీ పరిధి లో 119 రెగ్యులర్ పోస్టులతో పాటు ఫార్మసీ, ఎంఈడీ విభాగాలను కలుపు కుంటే 172 మంది అధ్యాపకులు అవసరం. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి 17 విభాగాల్లో పీయూ కళాశాలలో 700 మంది విద్యార్థినులు ఉండగా, దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉంటారు.