
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన ఎ.రేవంత్‌రెడ్డి అనుచరులకు పదవులిస్తూ టీపీసీసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనతోపాటు పార్టీలో చేరిన 18 మంది నేతలకు పీసీసీతోపాటు అనుబంధ విభాగాల్లో ప్రాధాన్యత కలిగిన పదవులు లభించాయి. వీరితోపాటు కంచె రాములు అనే మరో నాయకుడికి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవి లభించింది.