సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల భర్తీకి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి కోఠీలో ఉన్న డీఎంఈ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు. మల్టీ జోన్ –1 అభ్యర్థులకు 15, 16 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మల్టీ జోన్ –2 అభ్యర్థులకు 17, 18 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మల్టీ జోన్ 1, 2 రెండింటిలోని సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు 19వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు.
అభ్యర్థులందరూ డీఎంఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సూచనలు పాటించాలని, ఆ ప్రకారం సంబంధిత ధ్రువీకరణపత్రాలతో పాటు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. జోన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా వివరాల షెడ్యూల్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://dme.telangana.gov.in లో ఉంచామని తెలిపారు.
1442 పోస్టుల భర్తీ
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 34 స్పెషాలిటీలకు చెందిన 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను మెడికల్ – హెల్త్ సర్వి సెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 8వ తేదీన ప్రకటించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొని రావాలి.
బోర్డుకు అందజేసిన దరఖాస్తు ఫారం కాపీ, బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన నాన్ క్రిమీలేయర్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్‌లు తీసుకొని రావాలి. సీట్ మ్యాట్రిక్స్‌ను కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శిస్తారు. ఉదయం పూట కౌన్సిలింగ్ ఉన్న అభ్యర్థులు 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం సమయం కలిగిన అభ్యర్థులు 1.30 గంటల కల్లా చేరుకోవాలి.
ఏ రోజు ఎవరికి కౌన్సిలింగ్?
♦ 15వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాడయాగ్నసిస్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, జనరల్ మెడిసిన్, టీబీసీడీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది.
♦ 16వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకే జనరల్ సర్జరీ, ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్‌టీ విభాగాల్లో నిర్వహిస్తారు.
♦ 17వ తేదీన మల్టీ జోన్–2 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, టీబీసీడీ, జనరల్ సర్జరీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది.
♦ 18వ తేదీన ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్‌టీ రేడియో డయాగ్నసిస్ విభాగాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
♦ 19వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మల్టీ జోన్ –1 అభ్యర్థులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి మల్టీ జోన్–2 అభ్యర్థులకు ఈఎండీ, రేడియేషన్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ ఎఈడీ, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రైనాలజీ, ఎంఈడీ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment