వాటికి సెక్షన్–111 వర్తించదు
రెండు వేర్వేరు తీర్పుల్లో హైకోర్టు స్పష్టీకరణ
బెయిల్ రాకుండా చేసేందుకే ఈ సెక్షన్ కింద కేసు
ఎప్పుడు ‘111’ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పిన న్యాయస్థానం
ఇప్పుడు తాజాగా కేసులు ఎదుర్కొన్న వారికి సెక్షన్–111 వర్తించదు
ఎందుకంటే.. వారిలో ఎవరిపై కూడా గత పదేళ్లలో చార్జిషీట్లు దాఖలు కాలేదు
ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు తీర్పులూ స్పష్టంచేశాయి
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదని.. వాటికి సెక్షన్–111 వర్తించదని హైకోర్టు ఇప్పటికే రెండు వేర్వేరు సందర్భాల్లో స్పష్టంచేసింది. అసలు ఏ సందర్భంలో బీఎన్‌ఎస్ సెక్షన్–111 (వ్యవస్థీకృత నేరం) వర్తిస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పింది.
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఏకపక్షంగా ఈ సెక్షన్‌ను పెడుతున్న కేసుల్లో పలువురు మేజి్రస్టేట్‌లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది.
సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయనేందుకు దర్యాప్తు అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపకపోయినా కూడా కొందరు మేజి్రస్టేట్‌లు ఆ రిమాండ్ రిపోర్టుల పట్ల సంతృప్తి వ్యక్తంచేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు పక్షం రోజుల వ్యవధిలో ఇచ్చిన తీర్పులు పోలీసులకు చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సులభంగా బెయిల్ రాకూడదనే
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చంది మొదలు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా పోలీసులు వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
సులభంగా బెయిల్ రాకుండా చేసేందుకు సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ సెక్షన్–111 కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి.. ఇప్పుడు ఎవరిపై అయితే కేసులు నమోదు చేశారో వారికి ఈ సెక్షన్ వర్తించదని పోలీసులకు స్పష్టంగా తెలిసినప్పటికీ, రాజకీయ కారణాలతో వారు తప్పుడు కేసులు నమోదుకు వెనుకాడటంలేదు.
సెక్షన్–111 వర్తించాలంటే..
భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. ఓ నిందితునికి సెక్షన్–111 వర్తించాలంటే, ఆ వ్యక్తిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్ దాఖలై, అందులో కనీసం ఒక్క చార్జిషీట్‌నైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పులు కూడా స్పష్టంచేశాయి.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో ఎవ్వరిపై కూడా గత పదేళ్లలో కనీసం రెండు చార్జిషీట్‌లు దాఖలై, అందులో ఒక దానిని కోర్టు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేనేలేవు.
కాబట్టి.. సోషల్ మీడియా పోస్టులపై ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న వారికి సెక్షన్–111 వర్తించే అవకాశమేలేదు. ఇదే కారణంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ను తప్పుపట్టింది.
సోషల్ మీడియా కేసులకు ‘111 సెక్షన్’ వర్తించదు
» కోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి
» మేమేజిస్ట్రేట్లు సైతం ఈ కేసుల్లో రిమాండ్ తిరస్కరిస్తున్నారు
» సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు
» యథేచ్చగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన
» ‘బీఎన్‌ఎస్ 111’ కేసులపై క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం
» ప్రైవేటు కేసులతో పోలీసులను న్యాయస్థానంలో నిలబెడతాం
» వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మలసాని మనోహర్‌రెడ్డి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను టీడీపీ కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. వీరిపై పోలీసులు బీఎన్‌ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని.. నిజానికి, ఈ సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని ఆయనన్నారు.
అయినా కూడా పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రతోనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే..
వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై మాత్రమే బీఎన్‌ఎస్ 111 సెక్షన్ ప్రయోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏపీ పోలీసులు మాత్రం దీనిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదం మోపేందుకే బీఎన్‌ఎస్ 111 సెక్షన్‌ను వారిపై అక్రమంగా బనాయించి వేధిస్తోంది.
సాధారణంగా ఈ సెక్షన్‌ను మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ సరఫరా, కిడ్నాప్, దొంగతనాలు, దోపిడీలు, బలవంతంగా ఆస్తుల స్వా«దీనం.. సుపారీలు తీసుకుని హత్యలు చేయడం, ఆరి్థక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారు. అలాగే, ఈ చట్టం రావడానికి కనీసం పదేళ్ల ముందు నుంచి నేరాలకు పాల్పడి ఉండి.. ఒకటి కన్నా ఎక్కువ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులపైనే ఈ సెక్షన్‌ను వాడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
కానీ, కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అభంశుభం తెలియని సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ సెక్షన్‌ను బనాయించి వారిని ఎక్కువ కాలం జైళ్లలో నిర్బంధించే కుట్రలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇప్పటికే ఎంతోమందిని జైళ్లకు పంపారు. ఈ అక్రమ నిర్బంధాలు ఎక్కువ కాలం నిలబడవని ప్రభుత్వం, పోలీసులు తెలుసుకోవాలి.
ప్రైవేట్ కేసులు వేస్తాం..
ఈ నేపథ్యంలో.. ఈ సెక్షన్లు పెట్టిన అన్ని కేసుల్లోనూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. ఈ కేసులు బనాయిస్తున్న అధికారులపైన న్యాయస్థానాల్లో పోరాడుతాం. అర్థరాత్రి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయించడాలు, నెంబర్లు లేని వాహనాల్లో మఫ్టీలో వచ్చి అపహరించడం.. కుటుంబ సభ్యులకు ఎఫ్‌ఐఆర్ ఇవ్వకపోవడం, అరెస్టు చూపకుండా.. ఆచూకీ చెప్పకుండా వారిని వేధించడం, రోజుకో పోలీస్‌స్టేషన్‌కి తిప్పడం.. ఇలా పది రోజులపాటు తిప్పిన సందర్భాలున్నాయి.
ఇప్పటికే ఎన్నో కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసి కార్యకర్తల ఆచూకీ తెలుసుకున్నాం. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారందర్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రైవేట్ కేసులు వేసి వీటితో సంబంధమున్న ప్రతి పోలీస్ అధికారిని కోర్టులో ముద్దాయిగా నిలబెడతాం.
మా దారిలోకి రాకపోతే ఏమైనా చేస్తామనే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఆఖరికి జడ్జీలపై నిఘా పెట్టే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. న్యాయవాదులుగా మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థ జోలికొస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment