
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సబార్డినేట్–50, సిస్టమ్ అసిస్టెంట్–45, ఎగ్జామినర్–17, అసిస్టెంట్–10, స్టెనో–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–2, కంప్యూటర్ ఆపరేటర్–20, ట్రాన్స్‌లేటర్–10, కోర్టు మాస్టర్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు–20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌లో వీటికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు, విద్యార్హత, వయసు, రిజర్వేషన్, భర్తీ విధానం, పరీక్ష ఫీజు తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌లో చూడొవచ్చని రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) తెలిపారు. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment