విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ: ఆదిమూలపు | Adimulapu Suresh Said 2397 Posts Would Be Filled In Education Department | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ: ఆదిమూలపు

Published Fri, Jun 18 2021 5:30 PM | Last Updated on Fri, Jun 18 2021 8:01 PM

Adimulapu Suresh Said 2397 Posts Would Be Filled In Education Department - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021-22కు విడుదల చేసిన మొత్తం 10,143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక, ఉన్నత విద్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులు అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక చేయనున్నామని తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటికి విద్యాశాఖలో 5,812 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మంత్రి తెలిపారు.

ఇప్పుడు 2021-22 లో మొత్తం 1238 బ్యాక్ లాగ్ పోస్టుల్లో విద్యాశాఖ నుంచి 157 పోస్టులు ఉన్నాయి. అందులో అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 ఉన్నాయి. మొత్తం 157 పోస్టుల్లో 92 ఎస్సీ, 65 ఎస్టీ కేటగిరికి చెందినవని మంత్రి తెలిపారు. ఈ పోస్టులకు జూలై 2021లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనుండగా జనవరి 2022లో వీటికి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2022లో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అవకాశాలు కల్పించటం జరుగుతుందని, దళారులు, లంచగొండితనం లేకుండా మెరిట్ మీదనే ఉద్యోగాలు దక్కటంతో అందరూ జగనన్నను అభినందిస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు.

చదవండి: ఏపీ: జాబ్‌ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement