
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రణాళిక ఖరారైంది. వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అదే రోజు విద్యార్థులకు 'జగనన్న విద్యా కానుక' అందిస్తామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే 43 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక ఇస్తామని తెలిపారు. ఇందుకోసం మొత్తం రూ.650 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. గురువారం మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల నుంచి కళాశాలల వరకు వచ్చే విద్యా సంవత్సరాన్ని నిర్ణయించినట్లు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. (నాడు-నేడుపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు)
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలు ఉంటాయని, ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీచర్ల బదిలీల ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ 15 నుంచి జూనియర్ కళాశాలలు పున: ప‌్రారంభం అవుతాయని వెల్లడించారు. కళాశాలలు తెరవగానే గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21 లోపు అన్ని సెట్లు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లా సెడ్, ఎడ్ సెట్‌లన్నీ ఒకే వారంలో నిర్వహిస్తామన్నారు. (సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ స్టార్ట్‌వచ్చే నెల 5న స్కూళ్లు రీ ఓపెన్)
Comments
Please login to add a commentAdd a comment