ఖరీఫ్‌కు 11 లక్షల టన్నుల విత్తనాలు
ఖరీఫ్‌కు 11 లక్షల టన్నుల విత్తనాలు
Published Mon, Dec 5 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్ కె.ధనుంజయరెడ్డి
- ఏఓ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల వినతి
- 30 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పిన డైరెక్టర్
మహానంది : వచ్చే ఖరీఫ్ సీజన్‌కు 11 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్ కె.ధనుంజయరెడ్డి తెలిపారు. మహానంది వ్యవసాయ కళాశాల రజతోత్సవాలకు హాజరైన ఆయనను ఆదివారం వ్యవసాయ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 150 ఏఓ పోస్టుల భర్తీకి విన్నవించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం 30 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ అనుమతి ఇచ్చిందన్నారు. మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. అనంతరం వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు మెంబరు, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆయనను కలిసి మహానంది వ్యవసాయ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement