30 నుంచి విత్తనాల పంపిణీ | seeds distribution from 30th | Sakshi
Sakshi News home page

30 నుంచి విత్తనాల పంపిణీ

Published Sat, May 27 2017 11:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

seeds distribution from 30th

- జేడీఏ ఉమామహేశ్వరమ్మ
 - ఏర్పాట్లు చేసుకోవాలని ఏడీఏ, ఏఓలకు ఆదేశం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ ఏడీఏ, మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేరుశనగ సహా ఇతర అన్ని రకాల విత్తనాలను బయోమెట్రిక్‌ ద్వారా పంపిణీ చేయాలన్నారు. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించారు. 10 వేల క్వింటాళ్లు బఫర్‌లో పెట్టుకొని మిగిలిన 50,600 క్వింటాళ్లను సాగు విస్తీర్ణాన్ని బట్టి మండలాలకు కేటాయించారు. రైతుకు ఉన్న భూమిని బట్టి గరిష్టంగా నాలుగు ప్యాకెట్ల వేరుశనగ( 120 కిలోలు) పంపిణీ చేస్తారు. డి- క్రిషి యాప్‌ 2. 1. 5 వర్షన్‌ ద్వారా  విత్తనాలను పంపిణీ చేస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement