
ఎస్‌ఐ పోస్టులు పెంచాలి
ఎస్సై పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సప్తగిరి సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించి, టవర్‌క్లాక్ వద్ద బైఠాయించారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎస్సై పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సప్తగిరి సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించి, టవర్‌క్లాక్ వద్ద బైఠాయించారు. ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉద్యోగ నియామకాలకు నోటీఫికేషన్ విడుదల చేయాలేదన్నారు. రాష్ట్రంలో మొత్తం 1200 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం 707(సివిల్, ఏ ఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమన్నారు. మిగితా జోన్ల కన్నా జోన్–4కు (రాయలసీమకు) కేవలం 57 పోస్టులను మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. సివిల్స్ పరీక్షలను పాత పధ్ధతి ద్వారానే కొనసాగించాలన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల చొప్పున∙నిరుద్యోగ భృతిని అందజేయాలన్నారు. నిరుద్యోగ ఐక్యవేదిక నాయకులు మహేష్, విజయ్, హరి, నాగరాజు, రాఘవేంద్ర, వివిధ కళాశాలల విద్యార్థీనివిద్యార్థినులు హాజరయ్యారు.