నియామకాలన్నీ నిలిపివేయాలని అధికారులకు మౌకిక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా గత ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియను నిలిపివేస్తోంది.
ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా జీరో వేకెన్సీ (ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ) పాలసీని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూనే, రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచి్చంది. ఐదేళ్లలో ఒక్క వైద్య శాఖలోనే ఏకంగా 54 వేల పోస్టుల భర్తీని చేపట్టింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీకి తిలోదకాలు ఇవ్వనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వైద్య శాఖలో ప్రస్తుతం జరుగుతున్న నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త వైద్య కళాశాలల్లో అవసరాల కోసం వివిధ రకాల 380 పోస్టులను డీఎంఈ పరిధిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేయగా.. ఈ పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం ఆమోదం తెలపలేదు.
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీíÙయన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిల్లో నోటిఫికేషన్‌లు జారీ చేశారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 200 నుంచి 250 పోస్టుల చొప్పున మూడు వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టాల్సి ఉంది. దరఖాస్తులను సైతం స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు.
అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చంది. దీంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ పూర్తయింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది.
వైద్య సేవలపై ప్రభావం
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నిలిచిపోయి ఆస్పత్రుల్లో సరిపడా నర్సులు లేక వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయి. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసిన మదనపల్లె ఆస్పత్రిలో కేవలం 30, పాడేరు ఆస్పత్రిలో 39 మంది నర్సులు మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. పాడేరులో ఉన్న వారిలో ముగ్గురు ప్రసూతి సెలవులో ఉన్నారు. 200 మంది నర్సులు ఉండాల్సిన ఈ ఆస్పత్రుల్లో ఐదో వంతు కూడా లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడంలేదు. పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో ఆయా ఆస్పత్రుల్లో సేవల కల్పనపై ప్రభావం పడనుంది.
కూటమి కక్ష సాధింపు
మరోవైపు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాల్సిన పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్ నర్స్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్‌లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు గత నెలలో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. గత నెల 6వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులందరు ఆరోజు ఆర్డీ కార్యాలయాల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని ఆదేశించింది.
అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. ఎంపిక జాబితాలు కూడా విడుదల చేసినా పోస్టింగ్‌లు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో వీరు ఎంపికయ్యారనే రాజకీయ కక్షతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఒకవేళ నియామక ప్రక్రియను నిలిపివేస్తే అభ్యర్థులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీ నేత అభ్యంతరమే కారణం!
ఉన్నట్టుండి కౌన్సెలింగ్ రద్దు చేయడానికి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పారీ్టకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభ్యంతరం చెప్పడమే కారణమని సమాచారం. గత ప్రభుత్వం నిర్వహించిన నియామక ప్రక్రియలో ఎంపికయ్యారనే అక్కసుతోనే ఈ ప్రజాప్రతినిధి ప్రభుత్వంపై ఒత్తిడి తెచి్చనట్లు తెలిసింది. కౌన్సెలింగ్ వాయిదా వేసి నెల గడిచినా పోస్టింగ్ ఉత్తర్వులపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment