కస్తూర్బా పోస్టులకు దరఖాస్తుల వెల్లువ | lot of application for kasturba posts | Sakshi
Sakshi News home page

కస్తూర్బా పోస్టులకు దరఖాస్తుల వెల్లువ

Published Wed, Nov 9 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

lot of application for kasturba posts

కర్నూలు(అగ్రికల్చర్‌): కస్తూర్బా పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదలైన నోటిపికేషన్‌కు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలోని ఈ పాఠశాలల్లో కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌లు, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లు, అకౌంటెంట్లు, ఎన్‌ఎన్‌ఎంలు, నైట్, డే వాచ్‌మెన్‌లు, అసిస్టెంటు కుక్స్‌ తదితర 84 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10 వరకు గడువున్నా మంగళవారం దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తారు.  నిరుద్యోగులు వేలాదిగా తరలి రావడంతో దరఖాస్తుల స్వీకరణకు సిబ్బంది అవస్థలు పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement