Vasireddy Padma Serious Comments On Vulgar Posts On Social Media - Sakshi
Sakshi News home page

అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ

Published Fri, Jun 30 2023 4:32 PM | Last Updated on Fri, Jun 30 2023 6:03 PM

Vasireddy Padma Serious Comments On Vulgar Posts on Social Media - Sakshi

సాక్షి, అమరావతి: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సెలబ్రిటీలపై అసభ్యకర పోస్టులు
ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై  అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు.  యూకేలో ఉన్న ఓ మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. 

వారిని సమర్థించడం సరికాదు
టీడీపీ కార్యకర్త శ్వేతా చౌదరి దారుణంగా మాట్లాడుతోందని,  ఆమెకు చంద్రబాబు మద్దతు తెలపడం సరికాదని హితవుపలికారు. సీఎం ఇంట్లో మహిళలను కించపరిస్తే ప్రతిపక్షనేత  ప్రోత్సహిత్సారా? అని మండిపడ్డారు. అటువంటి వారికి మద్దతుగా మాట్లాడతం చంద్రబాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్ పెర్సన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాధానం కాదని, ఎంత మాత్రం సమర్థనీయం కూడా కాదని ఆమె స్పష్టం చేశారు.
చదవండి: సీఎం జగన్‌ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ

సోషల్ మీడియా కట్టడి అవసరం
సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీసు వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారితీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యాయత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

జులై 5న సెమినార్‌
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న విజయవాడలో ఓ సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమాజంలోని మేథావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్‌లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు.

పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెపుతూ తమ కమిషన్‌కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు, ముఖ్యంగా సైబర్ క్రైం వారికి పంపించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement