సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 432 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను వైద్య, ఆరోగ్య శాఖలోని ఎంపిక కమిటీ భర్తీ చేస్తుంది. మిగతా మూడు రకాల పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–108, స్టాఫ్ నర్స్–216, ఫార్మసిస్ట్(గ్రేడ్ 2)– 54, ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ 2)–54.
Comments
Please login to add a commentAdd a comment