
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయానికి, జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ ఈ మేర కు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సీఈవో కార్యాలయంలో, అన్ని జిల్లాల్లో కలిపి తాత్కాలిక ప్రాతిపదికన 352 పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 691 పోస్టులను మం జూరు చేశారు. సీఈవో కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన 21 పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చారు.
జిల్లా ఎన్నికల అధికారులు పని చేసే కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయాల్లో కలిపి తాత్కాలిక ప్రాతిపదికన 331 పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మరో 631 పోస్టులను మంజూరు చేశారు. సీఈ వో కార్యాలయంలో సహాయ కార్యదర్శి 1, సెక్షన్ అధికారులు 5, అసిస్టెంట్ సెక్షన్ అధికారులు 12, సమాచార శాఖ ఏడీ 1, సమాచార శాఖ ఏపీఆర్వో 1 పోస్టులను డిప్యుటేషన్‌పై తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. జిల్లాలకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపదిక పోస్టులలో రెవెన్యూ శాఖలో పని చేసే 181 మంది డిప్యూటీ తహసీల్దార్లను, వివిధ శాఖల్లో పని చేసే 150 మంది సీనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment