హైదరాబాద్: రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 1,857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖాళీలపై అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డిపార్ట్‌మెం ట్ పరిధిలోని ఖాళీలన్నీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన భర్తీ కానున్నాయి. పోస్టులకు అర్హత నియమాలు ఇతర వివరాలందగానే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.