రైతు సమన్వయ సమితికి 15 పోస్టులు  | 15 Posts Sanctioned For Farmers Coordination Samithi | Sakshi
Sakshi News home page

రైతు సమన్వయ సమితికి 15 పోస్టులు 

Published Sat, Jun 9 2018 1:13 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

15 Posts Sanctioned For Farmers Coordination Samithi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రైతు సమన్వయ సమితిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 15 పోస్టులను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖ అధికారులనే ఈ పోస్టులకు నియమించాలని సూచించింది. మేనేజింగ్‌ డైరెక్టర్, జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, అకౌంట్‌ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులను ఒక్కోటి చొప్పు న కేటాయించగా, రెండు వ్యవసాయాధికారి (ఏవో) పోస్టులను కేటాయించింది. ఇద్దరు డేటా ఆపరేటర్లు, ముగ్గురు ఆఫీసు సబార్డినేటర్లు, చైర్మన్‌కు పీఏ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement