నగల కోసం నవవధువును.. | Unknown persons killed a woman in UP | Sakshi
Sakshi News home page

నగల కోసం నవవధువును..

Published Fri, May 12 2017 6:22 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

నగల కోసం నవవధువును.. - Sakshi

నగల కోసం నవవధువును..

కౌశాంబి(ఉత్తరప్రదేశ్‌): డబ్బు మీద ఆశ ఎంతటికైనా దిగజారుస్తుంది. ఒంటరిగా నిద్రిస్తున్న ఓ నవ వధువును గుర్తు తెలియని దుండగులు హత్యచేసి, నిప్పు పెట్టి నగలను దోచుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిన్హ్వాల్ కాపుర్వా గ్రామంలో చోటుచేసుకుంది. ఆశాదేవి(20)కి రాకేశ్ పటేల్ అనే వ్యక్తితో గత నెల 24వ తేదీన పెళ్లయింది. అత్తాగారింట్లో నుంచి ఆశాదేవి ఈ నెల 7న పుట్టింటికి చేరుకుంది.

గురువారం రాత్రి తన ఇంట్లోనే వెనుక భాగంలో నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆమె గొంతుకేసి రూ. 2 లక్షల విలువైన నగలను తీసుకున్నారు. తరువాత కిరోసిన్ పోసి నిప్పుటించారు. కుటుంబ సభ్యులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. తెల్లవారేంత వరకూ ఈ దారుణాన్ని కుటుంబసభ్యులు తెలుసుకోలేక పోయారు. ఆ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఆగంతకుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement