న్యూయార్క్: అమెరికాలోని భారతీయ విద్యార్థి వివేక్ సైనీ దారుణ హత్య ఘటనను అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’(ట్విటర్)వేదికగా తీవ్రంగా ఖండించింది. హర్యానాకు చెందిన 25 ఏళ్ల సైనీ జార్జీయాలోని లిథోనియా సిటీలో తాను పనిచేసే స్టోర్ వద్ద ఓ నిరాశ్రయుడి చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణ హత్యపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ సోమవారం తీవ్రంగా ఖండించింది.
The Consulate got in touch with the family of Mr Saini immediately after the incident, provided all consular assistance in sending the mortal remains back to India, and remains in touch with the family. 2/2@MEAIndia @IndianEmbassyUS
— India in Atlanta (@CGI_Atlanta) January 29, 2024
‘భారతీయ విద్యార్థి వివేక్ సైనీ హత్య అత్యంత దారుణం. ఇది చాలా క్రూరమైన, హేయమైన ఘటన. ఈ ఘటన పట్ల తాము తీవ్రమైన ఆవేదన చెందాం. దారుణ హత్య ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమెరికా పోలీసు అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి.. విచారణ చేస్తున్నారు’ అని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే కాన్సులేట్ అధికారులు సైనీ కుటుంబంతో సంప్రదింపు జరిపిందని తెలిపింది. సైనీ మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి కాన్సులేట్ అన్ని విధాల సహకారం అందించిందని పేర్కొంది.
భారత్‌లోని హర్యానాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా కూడా పొందాడు. జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్ టైమ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తాను పనిచేస్తున్న స్టోర్ వద్దకు వచ్చిన జూలియన్ ఫాల్కెనర్ అనే ఓ వ్యక్తి చేతిలో దురదృష్టవశాత్తు జనవరి 26న దారుణ హత్యకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment