Bapatla SP Says No Political Motive Behind 10th Student Amar Murder, Details Inside - Sakshi
Sakshi News home page

రాజకీయ కారణాల్లేవ్‌.. ప్లాన్‌ ప్రకారమే అమర్‌ హత్య: బాపట్ల ఎస్పీ ప్రకటన

Published Sat, Jun 17 2023 3:01 PM | Last Updated on Sat, Jun 17 2023 4:11 PM

Bapatla SP Says No Political Motive Behind 10th Student Amar Murder - Sakshi

సాక్షి, బాపట్ల: చెరుకుపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన పదో తరగతి స్టూడెంట్‌ అమర్‌నాథ్‌ ఉదంతంపై బాపట్ల ఎంపీ వకుల్‌ జిందాల్‌ స్పందించారు. ఈ హత్య  ప్లాన్ ప్రకారమే జరిగిందని.. కేసుకు సంబంధించి పలు వివరాలను తెలియజేశారాయన. 

అమర్‌నాథ్‌ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవు. ప్లాన్‌ ప్రకారం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమర్ సోదరికి ఫోన్స్, మెసేజ్ చేసి వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమర్ పై వెంకటేశ్వరరెడ్డి కోపం పెంచుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వరరెడ్డికి హత్యలో గోపిరెడ్డి, వీరబాబు, సాంబిరెడ్డి సహకరించారు అని తెలిపారు. 

ఈ కేసులో వెంకటేశ్వరరెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. సాంబిరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వివరించారాయన. 

ఇదీ చదవండి: అమర్‌ కుటుంబానికి న్యాయం చేసి తీరతాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement