
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి రావాల్సిందేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. శనివారం ఆయన మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా తగిన సలహాలు ఇవ్వకుండా హైదరాబాద్‌లో కూర్చొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార యంత్రాంగం తలమునకలై పనిచేస్తున్నారన్నారు. రైతులకు నష్ట్రం రాకుండా అన్ని జాగ్రత‍్తలు తీసుకున్నామని చెప్పారు. ఆక్వా రంగానికి కనీస ధర నిర్ణయించామన్నారు. ఆక్వా ఫిషరీస్ రంగాలపై వచ్చిన నష్ట్రాలపై రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక అందజేస్తామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment