నగరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలివా.. చంద్రబాబుకు తొత్తువా... అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆదివారం బాపట్ల జిల్లా నగరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదల కోసం, భవిష్యత్ కోసం పనిచేస్తున్నారో.. టీడీపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని పురందేశ్వరిని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పా ర్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రైతులను, ప్రజల్ని మోసం చేశారంటూ చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి.. నేడు ప్రజలపై టీడీపీ అజెండా రుద్దేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పురందేశ్వరి బీజేపీ నావ ఎక్కి.. టీడీపీ తెడ్డు తిప్పుతున్నారని విమర్శి«ంచారు. ఏ అర్హతతో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని లేఖ రాశారో చెప్పాలన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాటా్లడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో పురందేశ్వరి కూడా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబును కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. బీజేపీ అధ్యక్షురాలిలా ఆమె వ్యహరించడం లేదన్నారు. అవినీతికి పాల్పడి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళితే ఆయనకు వత్తాసుగా పురందేశ్వరి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. పురందేశ్వరి పదేపదే ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment