purandareshwari
-
పురందేశ్వరి ఉండబట్టే పొత్తు
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉండబట్టే ఆ పార్టీతో పొత్తు సాధ్యమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆమె స్థానంలో వేరే వారు ఉంటే ఏమయ్యేదో తెలియదని అన్నారు. కూటమిలోని మూడు పార్టీల స్వభావాలు వేరైనా, ఆలోచన ఒకటేనని అన్నారు. మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని, వీలైతే ఆరోజే సిలిండర్లు ఇస్తామని చెప్పారు. వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.350 కోట్లు వచ్చాయని తెలిపారు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని అన్నారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. ఎమ్మెల్యేలు తప్పులు చేయకూడదని, కక్ష సాధింపులకు దిగవద్దని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి చేయవచ్చని, ఆ నిధులు పవన్ కళ్యాణ్ వద్దే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంలో పవన్ దగ్గరే ఎక్కువ నిధులున్నాయని చెప్పారు.అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే అప్పటి ముఖ్యమంత్రి అటు వైపే వెళ్లలేదని, పులిచింతల గేట్లు కొట్టుకుపోతే బిగించడానికి రెండు సీజన్లు పట్టిందని అన్నారు. కానీ కర్ణాటకలో తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే తాము వెళ్లి కన్నయ్యనాయుడు నేతృత్వంలో గేట్లు బిగించామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటుపై గత ఐదేళ్లలో నోరు మెదపని వైఎస్సార్సీపీ ఇప్పుడు గొడవ చేస్తోందని అన్నారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వంద రోజుల పాలనపై ఈ నెల 20 నుంచి ఆరు రోజులు ప్రచారం చేయాలని సూచించారు. త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని చెప్పారు. అప్పటి నా ప్రకటనకు వ్యూహమే లేదు : పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే తన ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరిక తప్ప వ్యూహమేమీ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు తాను షూటింగ్‌లకు కూడా వెళ్లలేదని అన్నారు. చంద్రబాబును చూసి తాను చాలా నేర్చుకున్నానని, ఆయనకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
వదినా మరుదుల కుట్ర ఫలితమే విధ్వంసం
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే.. ఈ దాడుల వెనుక చంద్రబాబు, ఆయన వదిన పురందేశ్వరి ధ్వంసరచన కుట్రే కనిపిస్తోందని’.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రౌడీమూకలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కనబెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులకు దిగాయి. ఈ మూకలు అంతగా రౌడీయిజం చెలాయిస్తూ, వైఎస్సార్సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా, పోలీసుయంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం.. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ద్వారా ఎన్నికల ప్రక్రియను అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైందని’.. అప్పిరెడ్డి వివరించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల టార్గెట్‌గా జరిగిన పెత్తందార్ల దాడులివి. వదిన మరుదులు పురందేశ్వరి, చంద్రబాబుల ధ్వంసరచన కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలయ్యారు. పోలీసులే పాత్రధారులుగా తాడిపత్రి, నరసరావుపేట దుర్ఘటనలు జరిగాయి. కేంద్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి. మేం అధికారంలోకి రాగానే తప్పుడు అధికారులపై చర్యలుంటాయి..’ అని అప్పిరెడ్డి హెచ్చరించారు. ‘సీఎం జగన్ నాయకత్వమే మళ్లీ రావాలని పేదలు కోరుకున్నారని ఆ వర్గాన్నే టార్గెట్ చేసి దాడులు చేయడం భావ్యమేనా? ఇప్పటికైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేయాలని కోరుతున్నాం. మేము అధికారంలోకి రాగానే విలువల్ని తుంగలో తొక్కి చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఆయన కోసం పనిచేసిన వారందరినీ లెక్కగట్టి శాఖాపరమైన విచారణకు పిలిపిస్తాం. ఆధారాలతో సహా రుజువు చేసి వారిపై చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం..’ అని అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
బీజేపీ నిర్ణయాలతో కూటమి కుదేల్
భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను బతిమాలుకుని బామాలుకుని.. పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కూటమికి ఆ పొత్తు వల్ల ఎంత లాభమో తెలీదు కానీ.. కోలుకోలేనంత నష్టం అయితే తప్పదని రాజకీయ పండితులు అంటున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్న బీజేపీతో జట్టు కట్టినందుకు విశాఖ జిల్లాలో కూటమిపై గుర్రుగా ఉన్నారు ప్రజలు. ఇక బీజేపీ కేంద్రమంత్రులు ముస్లిం రిజర్వేషన్లపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు టీడీపీని చావుదెబ్బ తీయడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ ఉన్న కూటమికి ముస్లింలు ఓటు వేసే పరిస్థితే ఉండదంటున్నారు.ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే తెలుగుదేశం పార్టీ మనుగడే కష్టమని భావిస్తోన్న చంద్రబాబు ఒంటరి పోరాటానికి ధైర్యం చేయలేకపోయారు. ముందుగా జనసేన పార్టీతో జట్టు కట్టారు. ఆ తర్వాత బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నాయకత్వానికి రాయబారాలు పంపారు. తమతో పొత్తు పెట్టుకుంటే అడిగిన ఎంపీ సీట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. చాలా కాలం పాటు టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటూ వచ్చిన కమల నాథులు మొత్తానికి చంద్రబాబు పార్టీతో పొత్తుకు సై అన్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు మత్రమే ఉన్నాయి. అయినా చంద్రబాబు పట్టుబట్టి పొత్తు పెట్టుకోడానికి వేరే కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు అయినా కూడా మూడు పార్టీల క్షేత్ర స్థాయి కార్యకర్తల మధ్య ఇంతవరకు సయోధ్య కుదరలేదని ఆయా పార్టీల నేతలే కంగారు పడుతూ వచ్చారు. మిత్ర పక్షాల కోసం పలు సీట్లలో అభ్యర్ధులను మార్చుకోవలసి వచ్చింది కూడా. మూడు పార్టీలు కలిసి బరిలో దిగినా కూడా శ్రేణుల్లో ఉండాల్సిన జోష్ ఇంకా రాలేదు. ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. బీజేపీ-జనసేన పార్టీల్లో ఒరిజినల్ నేతలను పక్కన పెట్టి టిడిపి నేతలకే టికెట్లు ఇప్పించుకోవడం కూడా కూటమికి మైనస్సే అయ్యింది.ఈ తలనొప్పులతోనే సతమతమవుతూ ఉంటే బీజేపీ కేంద్ర మంత్రుల ప్రచారం టీడీపీ, జనసేనలను లాగి లెంపకాయ కొట్టింది. ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ చెప్పారు. బీజేపీ విధానం కారణంగా టీడీపీకి ముస్లిం ఓట్లు పడే అవకాశాలు పూర్తిగా పోయాయి. చంద్రబాబు పాలనలో ముస్లింలను ఏనాడూ పట్టించుకోలేదన్ విమర్శలు ఎలానూ ఉన్నాయి. అవి చాలవన్నట్లు ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన రిజర్వేషన్లకు ఎసరు పెట్టే బీజేపీతో అంటకాగుతోన్న టీడీపీకి ముస్లింలు ఓటు వేసే పరిస్థితులు ఉండనే ఉండంటున్నారు ముస్లిం మేధావులు.ఇక ఉత్తరాంధ్రలోనూ ఓ సమస్య ఉంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు అయ్యల చేతుల్లో పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ వై.ఎస్. జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో ఆంధ్రులకు భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని.. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించరాదని అందులో కోరారు జగన్. అంతే కాదు కర్మాగారం లాభసాటిగా నడవాలంటే ఏం చేయాలో కొన్ని సూచనలు, సిఫారసులను కూడా ఆ లేఖలో పొందు పర్చారు. ఉక్కు కార్మికుల ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేశారు కూడా.బీజేపీ మిత్ర పక్షమైన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ గతంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నోరు మెదపలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం తాను కేంద్రంతో మాట్లాడి కార్మికులను ఆదుకుంటానన్నారు. టీడీపీ నేత చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కాపాడతానన్నారు. అయితే విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ ప్రయోజనాలను పరిరక్షిస్తారన్న నమ్మకం ఉక్కు కార్మికుల్లో లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. విశాఖ జిల్లాలో కనీసం ఆరేడు నియోజక వర్గాలపై ఉక్కు కార్మికుల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ-జనసేనలకు భారీ నష్టం తప్పదంటున్నారు రాజకీయ పండితులు.-సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
చిన్నమ్మా.. ఎందు‘కమ్మ’!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కమల దళంలో కలకలం రేగుతోంది. కమలం పార్టీలో ఒక సామాజికవర్గానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ ఇతర సామాజికవర్గ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల్లోనే కాదు.. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలోనూ వారిదే పైచేయిగా ఉందన్న అసంతృప్తి శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశంతో చేతులు కలిపాక ఈ ప్రాధాన్యం మరింత పెరిగిందంటూ నేతలు రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును తప్పించి వ్యూహాత్మకంగా దగ్గుబాటి పురందేశ్వరి ఆ పదవి దక్కించుకున్నారు. అప్పట్నుంచి పార్టీ పటిష్టానికి కాకుండా తమ సామాజికవర్గం బలోపేతం కావడం కోసమే ఆమె ఎక్కువగా పాటుపడుతున్నారని బీజేపీలోని ఒక బలమైన వర్గం భావిస్తోంది. వీరి వాదన ప్రకారం.. ఒకే సామాజికవర్గానికి చెందిన పార్టీ రాష్ట అధ్యక్షురాలు పురందేశ్వరి, ప్రధాన కార్యదర్శి తపన్ చౌదరి, మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, సోషల్ మీడియా ఇన్చార్జి కేశవ్కాంత్, అధికార ప్రతినిధి లంక దినకర్, మీడియా ప్యానలిస్టు వై.రామ్‌కుమార్ తదితరులు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర భార్యదీ ఆ సామాజికవర్గమే. రాష్ట్ర పదాధికారుల్లోనూ సగానికిపైగా పురందేశ్వరి సామాజికవర్గం వారే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ సామాజికవర్గానికి చెందిన వారితో పాటు వారితో సంబంధం ఉన్న వారికే సీట్లు కేటాయించడాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. అసెంబ్లీ నాలుగు.. పార్లమెంటు మూడు రాష్ట్రంలో పొత్తులోభాగంగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో మూడు స్థానాలు ఆ సామాజికవర్గానికే కేటాయించారు. రెండు సీట్లు క్షత్రియులకు, రెండు బీసీలకు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. వీరిలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్‌లో, కామినేని శ్రీనివాస్ కైకలూరులో, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎన్.ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. ధర్మవరం సీటు దక్కించుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సతీమణి కూడా పురందేశ్వరి సామాజిక వర్గానికి చెందిన వారే. లోక్‌సభకు పోటీ చేస్తున్న 6స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి మూడు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, కొత్తపల్లి గీత అరకు నుంచి పోటీలో ఉన్నారు. సీఎం రమేష్ సతీమణి, అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత భర్త కూడా పురందేశ్వరి సామాజికవర్గమే కావడం గమనార్హం. ఇలా ఈ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను ఆ కులస్తులకు గానీ, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆ వర్గంతో సంబంధం ఉన్న వారికే కేటాయించడం బీజేపీలో పెనుదుమారాన్ని రేపుతోంది. ఎక్కువ జనాభా కలిగిన కాపులకు, గుర్తింపు సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులకు అసెంబ్లీ, లోక్‌సభ సీటు ఒక్కటీ ఇవ్వకపోవడంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీలో బ్రాహ్మణ వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (విశాఖ లోక్‌సభ), కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు (రాజమండ్రి అసెంబ్లీ) సీట్లు ఆశించినా అవి దక్కకుండా తమ వారికే ఎక్కువ సీట్లు ఇచ్చేలా చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి చక్రం తిప్పారంటూ బహిరంగంగానే చర్చ జరుగుతోంది. కాషాయానికి ‘పచ్చ’ షాక్ బిక్కవోలు: టీడీపీ కండువా తీసేసి ప్రచారం చేసుకోవాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు కూటమి అభ్యర్థిని నిలువరించిన ఘటన బుధవారం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో అభ్యర్థిగా ములగపాటి శివరామకృష్ణరాజు ప్రచారం చేసుకుంటున్నారు. బిక్కవోలు మెయిన్‌రోడ్డులో బుధవారం ప్రచారం నిర్వహిస్తున్న ఆయనను టీడీపీ కార్యకర్తలు నిలువరించి ప్రచారంలో తమ పార్టీ కండువా, జెండాలను వాడవద్దని గొడవ చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా తనకు సహకరించాలని కోరినా ససేమిరా అని బలవంతంగా ఆయన మెడలోని కండువాని ఆయన చేతే తీయించారు. నడిరోడ్డుపై కూటమి అభ్యర్థిని టీడీపీ కార్యకర్తలు అవమానించిన తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. -
రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ?!
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందా?. కీలక సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడంతో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మంగళవారం నగరంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశానికి ‘ఆ నలుగురు’ రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బీజేపీ ఇప్పుడు.. టీడీపీ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ వర్గాలుగా విడిపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఏపీ ఎన్నికల ఇన్చార్జి అరుణసింగ్ సైతం హాజరయ్యారు. అలాంటి సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్థన్‌రెడ్డి, సత్యకుమార్‌లు గైర్హాజరు అయ్యారు. ఈ నలుగురు టికెట్లు ఆశించి భంగపడ్డ సంగతి తెలిసిందే. ఇక.. కూటమి పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాలు తీసుకుని.. అందులో ఐదింటిని వలస నేతలకే ఇచ్చింది. ఈ పరిణామాలపై ఏపీ సిసలైన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ తాజా ఎంపీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు అనుచరులకే సీట్లు దక్కాయి. అసెంబ్లీ సీట్లలోనూ 80 శాతం సొంత సామాజికవర్గానికే సీట్లు దక్కించుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాళ్లు సమావేశానికి రాలేదన్న టాక్ బలంగా వినినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సోమువీర్రాజు అనారోగ్యంతోనే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశించిన ఆయన.. ఆ టికెట్ పురందేశ్వరికి వెళ్లిపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి సత్యకుమార్, అనపర్తి నుంచి సోమువీర్రాజులు పోటీ చేయాలనే ప్రతిపాదనను ఏపీ బీజేపీ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే సోమువీర్రాజు అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలక సమావేశానికి ముఖ్యనేతల గైర్హాజరుపై బీజేపీ నేతల్లో చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి కామెంట్స్ మూడు పార్టీల పొత్తు చార్రితక అవసరం. పొత్తులతో చాలామంది ఆశావహులకు నిరాశ కలిగింది. రాష్ట్రంలో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు అయ్యాయి. -
ఔను.. పుష్ప అంటే ఫ్లవరే!
సాక్షి, అమరావతి : అందరూ ఊహించినట్లుగానే కూటమి పేరుతో చంద్రబాబు అల్లిన సాలెగూటిలో బీజేపీ చిక్కుకుంది. పదేళ్లుగా ఎదురులేకుండా దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయోపాయంలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ, ఆ స్థానాలేమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడంలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన అయిన పురందేశ్వరి కూడా సహకరిస్తుండటంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని, అభ్యర్థుల ప్రకటనే మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలు, ప్రాంతాలను కూడా మార్చేసి చంద్రబాబు తన మనుషులను బీజేపీ టికెట్లపై రంగంలోకి దింపుతున్నారు. బాబు ముందస్తు వ్యూహం బీజేపీని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చంద్రబాబు గత దశాబ్దకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన వాళ్లు అనుకొన్న వారిని ఆ పార్టీలోకి పంపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం మరికొందరు అనుంగులను బీజేపీలోకి పంపి, కోవర్టు రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరగానే తన సొంత నాయకులకే ఆ పార్టీ సీట్లు ఇప్పించుకొంటున్నారు. ఈ నాయకులు ప్రాంతం, జిల్లా కూడా చూడకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాలిపోతున్నారు. చంద్రబాబు అనుంగు సీఎం రమేష్ ఏకంగా కడప జిల్లా నుంచి ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనకు ఈ సీటు దాదాపు ఖరారు అయినట్టేనని కమలం పార్టీలో చర్చ సాగుతుంది. పొత్తు ఖరారు కాకముందు బీజేపీ ఒంటరిగా పోటీగా చేసేందుకు సిద్ధమైన సమయంలో అనకాపల్లి లోక్‌సభ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని కాదని రమే‹Ùకే ఇప్పుడు టికెట్టు ఇస్తున్నారు. జీవీఎల్‌కు సీటు దక్కకుండా.. విశాఖపట్నం బీజేపీకి రాష్ట్రంలోనే అత్యంత బలమైన ప్రాంతం. బీజేపీ బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల వారు విశాఖ పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విశాఖ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలన్న సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండేళ్లకు పైగా అక్కడే ఉంటూ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే, జీవీఎల్‌కు ఆ సీటు దక్కకుండా చంద్రబాబు, పురందేశ్వరి వ్యూహాత్మకంగా పక్కనే ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న విమర్శలూ ఉన్నాయి. సోము వీర్రాజు సీటుకే ఎసరు పెట్టిన పురందేశ్వరి రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకే పురందేశ్వరి ఎసరు పెట్టారు. రాజమండ్రి వీర్రాజు సొంత నియోజకవర్గం. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేత. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి వీర్రాజు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ చంద్రబాబు అండతో పురందేశ్వరి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన పురందేశ్వరి 2014 ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమె మధ్యలో ఏడెనిమిది లోక్‌సభ స్థానాలు దాటుకొని రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఆమెకు టికెట్ ఖరారైనట్టేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పోటీ చేసే మరో లోక్‌సభ స్థానం అరకు. ఇక్కడా మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతకు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్సీపీ తరపున గెలిచి, చంద్రబాబుకు కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును బీజేపీలో చేర్పించి, ఆయనకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే రాజకీయం టీడీపీతో పొత్తు లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీకి కూడా నిరాకరించిన కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరగానే కైకలూరు అసెంబ్లీ నుంచి కమలం గుర్తుపైనే పోటీకి సిద్ధపడుతూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కామినేని శ్రీనివాస్ కూడా బాబుకు దగ్గరైన నాయకుడే. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ ఆ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిపోయారు. ఆయన కోసమే జమ్మలమడుగు స్థానాన్ని బాబు బీజేపీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీలో చేరారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందు ఆయన మళ్లీ ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు సూరి కోసం ధర్మవరం సీటును బీజేపీకి చంద్రబాబు కేటాయిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా నేతకు బద్వేలు అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బద్వేలును బీజేపీకి కేటాయించారు. సీఎం రమేష్ సూచించిన అభ్యర్థితో సహా బద్వేలు సీటు కోసం పురందేశ్వరి ప్రతిపాదించిన ముగ్గురు ఇప్పటికీ బీజేపీలో చేరలేదు. ఆమె ప్రతిపాదించిన వారిలో ఒకరికి అవకాశం ఇస్తే.. వారు పార్టీలో చేరి, పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బద్వేలు అసెంబ్లీ సీటు కూడా పరోక్షంగా టీడీపీకి ఇచ్చినట్లేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. (సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్) మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది. జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టిడిపి పేర్కొంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది. సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం. డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది. (సభలో పరిస్థితి) ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం? చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్‌ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు. SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు? (మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్) టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 RTC బస్‌లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా! అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు? ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు? గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు? గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? మనుష్యులు మరణించినప్పుడు ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా? గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు. ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది. అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
వదినమ్మను లూప్ లైన్లోకి నెట్టిన చంద్రబాబు!
కాపురం చేసే కళ.. కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత! చంద్రబాబునాయుడుతో వ్యవహారం ఎలా ఉంటుందో పొత్తు కుదిరిన తర్వాత చర్చలకు కూర్చున్న తొలిరోజునే బయటపడిపోయింది. బతిమాలి బామాలి బిజెపి పెద్దల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి మొత్తానికి వారితో పొత్తు కుదుకున్న నారా చంద్రబాబునాయుడు.. పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత.. సీట్ల సర్దుబాటు చర్చల కోసం కూర్చున్న తొలిరోజునే తన విశ్వరూపం, అసలు రూపం చూపించేశారు. బిజెపిలో అంతర్గతంగా పొత్తులకు అనుకూలతను రాబట్టిన వదినమ్మ పురందేశ్వరికి అప్పుడే వెన్నుపోటు పొడిచేశారు. చర్చల రోజు నాటికే ఆమెను లూప్ లైన్లోకి నెట్టేశారు. రాష్ట్ర బిజెపి సారధి అయినప్పటికీ.. ఆమె చర్చల్లో లేకపోవడం ఇవాళ్టి రాజకీయ పరిణామాల్లో హైలైట్. రెండు రోజుల కిందట చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు ఢిల్లీలో రెండు రోజుల పాటు మకాం వేసి భాజపాతో పొత్తులు కుదర్చుకున్నారు. అయితే ఏ సీట్లలో ఎవరు పోటీచేయాలి అనేది తేలలేదు. ఆ విషయాలు చర్చించడానికి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బిజెపి నేత బైజయంత్ పండా వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యథావిధిగా తన వెన్నంటి నాదెండ్ల మనోహర్ ను తీసుకువెళ్లారు. తెలుగుదేశం తరఫున కూడా అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఈ భేటీలో పురందేశ్వరి లేరు. ఏపీ భారతీయ జనతా పార్టీకి ఆమె సారథి! అయినా సరే.. ఆమె లేకుండానే.. ఈ మూడు పార్టీల భేటీ జరగడం.. సీట్ల పంపకాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమె పట్ల అవమానకరమైన నిర్ణయం అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమౌతోంది. ఒకవైపు పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపట్టిన నాటినుంచి.. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డిని అదేపనిగా తిడుతూ చంద్రబాబునాయుడు బలం పెరగడానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు. చంద్రబాబు తరపున బిజెపిలో పనిచేస్తున్న సరికొత్త కోవర్టుగా కూడా ముద్ర వేయించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అలవాటు గురించి.. ఆమె మరచిపోయినట్టున్నారు. నిజానికి పురందేశ్వరి చంద్రబాబు వెన్నుపోటు ధోరణిని మర్చిపోకూడదు. ఎందుకంటే.. స్వయంగా ఆమె తండ్రి ఎన్ టి రామారావును వెన్నుపోటు పొడిచి.. అధికారం దక్కించుకున్న వ్యక్తి ఆయన! కాకపోతే ఆ వెన్నుపోటు పర్వంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాత్రధారి కావడం వలన ఆమె దానిని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. కొంతకాలం గడవగానే.. ఆమె భర్తను కూడా లూప్ లైన్లోకి నెట్టేసి పార్టీని మొత్తంగా హస్తగతం చేసుకున్న కుయుక్తుల మేధావి చంద్రబాబు. అలాంటి మరిది కుట్రబుద్ధుల గురించి ఆమెకు తెలియదని అనుకోలేం. అయినా సరే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బిజెపి సారథిగా వచ్చిననాటినుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఆ పార్టీని నడుపుతూ వచ్చారు. పొత్తులకు అనుకూల నివేదికలను తయారుచేసి ఢిల్లీ పంపారు. మరిది కోసం ఇన్ని చేసినప్పటికీ.. ఆయన మాత్రం.. తన వెన్నుపోటు బుద్ధి పోనిచ్చుకోకుండా.. ఆమెను పొత్తుకుదిరిన వెంటనే లూప్ లైన్లోకి నెట్టేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు టేలెంట్ ను ముందుముందు ఆమె మరింతగా చూడాల్సి వస్తుందని కూడా పార్టీలో అనుకుంటున్నారు. :::వంశీకృష్ణ -
కిషన్ రెడ్డి అలా.. పురంధేశ్వరి ఇలా..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసినన్ని రాజకీయ విన్యాసాలు ఇంకెవరూ చేసినట్లు సమకాలీన రాజకీయాల్లో చేసి ఉండరు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలసీ.. ఒక్కో పార్టీతో ఒక్కో మాదిరి పొత్తులు.. ఇక్కడున్న విధానం ఆ రాష్ట్రంలో ఉండదు. అక్కడున్నట్లు ఈ రాష్ట్రంలో ఉండదు.. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన ఆంధ్రాలో టీడీపీతో కలిసి సాగుతున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇక ఇదే చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌తో అంటగాకి బీజేపీని దెబ్బతీసేందుకు కృషి చేసింది. ఇక తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడ బీజేపీతో కలిసి ఎనిమిది సీట్లలో పోటీ చేసిన పవన్ ఘోరంగా దెబ్బతిన్నారు. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయి తీవ్ర పరాభవంతో తలదించుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం పవన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో పవన్‌తో పొత్తుకారణంగా తమకు నష్టం వాటిల్లిందని, లేకుంటే తాము ఇప్పుడు గెలిచినా ఎనిమిది సీట్లకు మించి ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ గెలిచేవాళ్లమని అన్నట్లుగా మెసేజీలు వచ్చాయి. అయితే వాటిని అయన తరువాత ఖండించారు. అయన అలా అన్నారో లేదో తెలియలేదు కానీ.. ఖండన అయితే వచ్చింది.. ఇక ఇటు ఆంధ్రాలో తాము జనసేనతో పొత్తులో ఉన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆంధ్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరించింది అని చెబుతూ.. ఏలూరు మెడికల్ కాలేజీకి రూ.525 కోట్లు ఇచ్చాం. భోగాపురం విమానాశ్రయానికి సైతం నిధులు ఇచ్చామని, ఇంకా పలు జాతీయరహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా రానున్న సాధారణ ఎన్నికలకు తాము జనసేనతో పొత్తుపెట్టుకుంటామని అన్నారు. అంటే అటు పవన్ మాత్రం తాను టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. మరి ఆ టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. కానీ పవన్ మాత్రం బీజేపీని టీడీపీని దగ్గర చేర్చాలని చూస్తున్నారు. తెలంగాణాలో వ్యతిరేకంగా పోటీ చేసిన టీడీపీ బీజేపీ.. ఇప్పుడు ఆంధ్రాలో కలిసి ఉంటాయా లేదా చూడాలి. చదవండి: ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..? -
కులగణనకు అనుకూలమా.. వ్యతిరేకమా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అణగారినవర్గాల అభ్యున్నతి, మరింత మెరుగైన సామాజికన్యాయం కల్పించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన కులగణనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అనుకూలమా.. వ్యతిరేకమా.. అనే విషయం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని పురందేశ్వరి పని చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలసీనే తన విధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎస్సీ, బీసీ కులాలను కించపరుస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని, బీసీలు జడ్జీలుగా పనికిరారని, వారి తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ‘గత లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు 20 పోలింగ్ బూత్‌లలో ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదు. మరో 40 బూత్‌లలో పదిలోపే ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. అందరికీ అటువంటి అదృష్టం కలిసిరాదు..’అని ఆయన పేర్కొన్నారు. కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ, పచ్చ పార్టీకి కాపలా కాయడం పురందేశ్వరికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలో పచ్చ కండువాలు స్వైరవిహారం చేస్తున్నాయని, స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ అపవిత్ర పొత్తులకు తెగించిందని స్పష్టమవుతోందని తెలిపారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని టోటల్ డ్రామాస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ తోకపార్టీల్లోనూ కుల పెత్తందారీ అహంకారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సీపీఎం నేత రాఘవులు చేసిన వ్యాఖ్యలు చూస్తే తోకపార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీ అధ్యక్షురాలివా.. బాబుకు తొత్తువా?
నగరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలివా.. చంద్రబాబుకు తొత్తువా... అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆదివారం బాపట్ల జిల్లా నగరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదల కోసం, భవిష్యత్ కోసం పనిచేస్తున్నారో.. టీడీపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని పురందేశ్వరిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పా ర్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రైతులను, ప్రజల్ని మోసం చేశారంటూ చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి.. నేడు ప్రజలపై టీడీపీ అజెండా రుద్దేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పురందేశ్వరి బీజేపీ నావ ఎక్కి.. టీడీపీ తెడ్డు తిప్పుతున్నారని విమర్శి«ంచారు. ఏ అర్హతతో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని లేఖ రాశారో చెప్పాలన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాటా్లడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో పురందేశ్వరి కూడా ఉన్నారని చెప్పారు. చంద్రబాబును కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. బీజేపీ అధ్యక్షురాలిలా ఆమె వ్యహరించడం లేదన్నారు. అవినీతికి పాల్పడి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళితే ఆయనకు వత్తాసుగా పురందేశ్వరి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. పురందేశ్వరి పదేపదే ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. -
బీజేపీని ‘బావ’ సారూప్య పార్టీగా మార్చిన పురందేశ్వరి
సాక్షి, అమరావతి: జాతీయ పార్టీ అయిన బీజేపీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ‘బావ’ సారూప్య పార్టీగా మార్చేశారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘అమ్మా పురందేశ్వరీ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించారు. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. 13 సార్లు సంతకం కూడా పెట్టారు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక తప్పుడు ఒప్పందంతో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ఈడీ కొందరిని అరెస్ట్ కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్ అని, దానితో సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి, రిమాండ్ విధించింది. బాబు అరెస్ట్, రిమాండ్ సరికాదన్న వాదనల్ని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి’ అని ఆయన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ‘సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో ఆయన పీఏనే వెల్లడించినట్లు ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా రూ.119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ ఐటీ శాఖ మీ మరిది చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్డ్ లూథ్రా, హరీష్ సాల్వే చంద్రబాబు కోసం చేసిన వాదనల్ని న్యాయస్థానాలూ తిరస్కరిస్తున్నాయి కాబట్టి, ‘బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్’ అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు. అన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని అబద్ధం చెపుతూ, లోకేశ్‌ని వెంటబెట్టుకుని బాబు తరపున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని కలిశారు. ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా మీ టాప్ ప్రయారిటి మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. -
బతుకమ్మ తెలంగాణకు తలమానికం
అంబర్‌పేట: ఆడబిడ్డల ప్రాముఖ్యతను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ కేంద్రమంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం రాత్రి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు